MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • School Holidays : వచ్చేవారం సెలవులే సెలవులు ... ఏడ్రోజుల్లో స్కూళ్లు, కాలేజీలు నడిచేది మూడ్రోజులే

School Holidays : వచ్చేవారం సెలవులే సెలవులు ... ఏడ్రోజుల్లో స్కూళ్లు, కాలేజీలు నడిచేది మూడ్రోజులే

School Holidays : తెలంగాణలో వచ్చేవారం కేవలం మూడురోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది... మిగతా ఐద్రోజులు సెలవులే సెలవులు. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 29 2025, 05:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
School Holidays

School Holidays

Holidays : పరీక్షల సీజన్ లో విద్యార్థులకు వరుస సెలవులు వస్తున్నాయి. పండగలు, ప్రత్యేక రోజుల సందర్భంగా వస్తున్న సెలవులు చదువుల ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కాస్త ఉపశమనం కల్పించనున్నాయి.  అంతేకాదు ఈ మండుటెండల వేళ చల్లగా ఇంట్లోనే ఉండే అవకాశం లభిస్తోంది. ఇలా విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా వచ్చేవారం భారీగా సెలవులు వస్తున్నాయి. ఏడెనిమిది రోజుల్లో ఏకంగా ఐదురోజులు సెలవులే వస్తున్నాయి. 

తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన హాలిడే క్యాలెండర్ ను పరిశీలిస్తే... ఉగాది, రంజాన్ పండగల మూడురోజులు సెలవులు వస్తున్నాయి. వాటికి మరోరెండు సెలవులు కూడా తోడయ్యాయి. దీంతో వచ్చేవారం కేవలం మూడ్రోజులు మాత్రమే తెలంగాణలోకి విద్యాసంస్థలు పనిచేస్తాయి. మిగతా ఐద్రోజులు మూసివేసి వుంటాయి. ఉగాది, రంజాన్ కాకుండా వచ్చేవారం ఇంకా ఏం సెలవులు వస్తున్నాయో తెలుసుకుందాం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
23
school holidays

school holidays

ఏప్రిల్ 5,6 రెండ్రోజులు ప్రత్యేక సెలవులు :  

రేపటినుండి వరుసగా మూడురోజులు (మార్చి 30 నుండి ఏప్రిల్ 1) పండగ సెలవులు వస్తున్నాయి. మార్చి 30న ఉగాది పండగ... దీంతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. కానీ ఈ పండగ ఆదివారం రావడంతో పండగ సెలవు లేకున్నా సాధారణ సెలవు వచ్చేది. 

ఇక తెలంగాణ ప్రభుత్వం ముస్లింల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా రెండురోజులు సెలవు ఇచ్చింది.  మార్చి 31న రంజాన్ పండగరోజే కాదు తర్వాతి రోజు ఏప్రిల్ 1 న కూడా సెలవు ఇచ్చింది. ఇలా వచ్చే సోమ, మంగళవారం కూడా విద్యార్థులు. ఉద్యోగులకు సెలవే. తిరిగి ఏప్రిల్ 2 బుధవారం స్కూళ్ళు ప్రారంభమవుతాయి. 

అయితే ఇలా స్కూళ్లు స్టార్ట్ అయి అలా మూడ్రోజులు గడవగానే వరుసగా మరో రెండ్రోజులు సెలవు వస్తుంది. ఏప్రిల్ 5 మాజీ ఉపప్రదాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  దీంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలన్ని ఆరోజు బంద్ కానున్నారు. 

ఇక తర్వాతిరోజు అంటే ఏప్రిల్ 6న హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీరామ నవమి. ఈ రోజున సీతారాముల కల్యాణం అట్టహాసంగా జరుపుకుంటారు. కాబట్టి సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 6 ఆదివారమే కాబట్టి ప్రభుత్వం పండగ సెలవు ఇవ్వకున్నా ఆరోజు సాధారణ సెలవు ఉండేది. 

ఇలా వచ్చేవారం మార్చి 30 ఉగాదితో ప్రారంభయ్యే సెలవులు మార్చి 31, ఏప్రిల్ 1 రంజాన్ వరకు కొనసాగుతాయి. మళ్లీ ఏప్రిల్ 5 జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 6 శ్రీరామనవమి సెలవులు వస్తాయి. అంటే వారంలో ఏడురోజులుంటే ఐదురోజులు సెలవులే వస్తున్నాయి... కేవలం మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలు నడిచేది. 

33
School Holidays

School Holidays

ఏప్రిల్ లో మొత్తం సెలవులెన్ని?  

ఈ ఏప్రిల్ లోనే విద్యాసంస్థలకు సమ్మర్ హాలిడేస్ ప్రారంభంకానున్నాయి. కానీ అప్పట్లోపు విద్యార్థులకు మరికొన్ని సెలవులు కూడా రానున్నాయి. ఇలా ఏప్రిల్ 1న అంటే రంజాన్ తర్వాతిరోజు  కూడా సెలవు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.  తర్వాత ఏప్రిల్ 5న జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6న శ్రీరామనవమి, ఏప్రిల్ 14న బిఆర్ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18న గుడ్ ప్రైడే సెలవులు వస్తున్నాయి. వీటికి నాలుగు సండేలు అదనం. 

ఇక ఏప్రిల్ 10న మహవీర్ జయంతి,  ఏప్రిల్ 14 తమిల్ న్యూ ఇయర్,  ఏప్రిల్ 30న బసవ జయంతి సందర్భంగా ఆప్షనల్ హాలిడ్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఈరోజుల్లో సెలవు ఇవ్వాలా వద్దా అన్నది విద్యాసంస్థల యాజమాన్యాల చేతిలో ఉంటుంది. మొత్తంగా ఏప్రిల్ లో కూడా బాగానే సెలవులు వస్తున్నాయి. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
విద్య
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
తెలంగాణ
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bakrid 2026 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ ఎప్పుడు.. బుధవారమా, గురువారమా?
Recommended image2
IMD Rain Alert : ఆల్రెడీ ఇక్కడ గాలివాన బీభత్సం ... కొద్దిసేపట్లో ఈ జిల్లాల్లోనూ అల్లకల్లోలమే
Recommended image3
TGSRTC: ఇక‌పై బ‌స్సుల్లో పోకీరిల ఆట‌లు సాగ‌వు.. భ‌రోసా ప్రాజెక్ట్ ప్రారంభించిన తెలంగాణ ప్ర‌భుత్వం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved