- Home
- Telangana
- Hyderabad : చికెన్ బిర్యానీ ఫ్యామిలీప్యాక్ ఫైసలతోనే ...సమ్మర్ లో కూల్ కూల్ గా హైదరాబాద్ టూర్
Hyderabad : చికెన్ బిర్యానీ ఫ్యామిలీప్యాక్ ఫైసలతోనే ...సమ్మర్ లో కూల్ కూల్ గా హైదరాబాద్ టూర్
Hyderabad Tour Package : ఎంతో చారిత్ర కలిగిన పురాతన నగరం హైదరాబాద్ పర్యటన కోసం తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ సమ్మర్ లో ఏసి బస్సెక్కి చల్లచల్లగా హైదరాబాద్ ను చుట్టిరావాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Hyderabad Tour Package
Hyderabad Tour Package: తెలంగాణ రాజధాని హైదరాబాద్ చాలా వైవిధ్యమైన నగరం... ఇది పాతకొత్తల కలయికకు పర్ఫెక్ట్ ఉదాహరణ. ఓవైపు మూసీ ఒడ్డున పాతనగరం... మరోవైపు ఆకాశాన్ని తాకే భవనాలతో కొత్తనగరం (సైబరాబాద్)... పర్యాటకుల ఈ నగరం సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ చరిత్రను తెలియజేసే ఓల్డ్ సిటీని చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. హైటెక్ హంగులతో రంగురంగుల ప్రపంచాన్ని చూడాలనుకునే యువత సైబరాబాద్ ను సందర్శిస్తుం టారు.
అయితే ఓల్డ్ సిటీలో అనేక చారిత్రక ప్రాంతాలున్నాయి. వాటిని సందర్శించి నగర చరిత్రను తెలుసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. దేశవిదేశాల నుండికూడా చార్మినార్, మక్కామసీదు, సాలార్జంగ్ మ్యూజియం వంటివాటిని చూసేందుకు సందర్శకులు వస్తుంటారు. కానీ నగరంలోని మొత్తం ప్రాంతాలను ఒక్కరోజులు చూడటం సాధ్యంకాదు. అందుకే చాలా ప్రాంతాలను చూడకుండానే వెళ్ళిపోతుంటారు.
ఇలా హైదరాబాద్ కు వచ్చే సందర్శకులకు ఎదురవుతున్న ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేవలం ఒక్కరోజులో పాత నగరంలోని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా 'హైదరాబాద్ సిటీ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్' పేరుతో ప్యాకేజీని తీసుకువచ్చింది.
Hyderabad Tour Package
హైదరాబాద్ వన్ డే టూర్ :
ఒకప్పటి హైదరాబాద్ నగర చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా ఈ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్ ప్యాకేజీని రూపొందించారు. ఇందులో భాగంగా టూరిజం శాఖకు చెందిన ప్రత్యేక బస్సులో నగరాన్ని దగ్గరుండి చూపిస్తారు. ఉదయం ప్రారంభమయ్యే ఈ టూర్ రాత్రి ముగుస్తుంది.
ఈ వన్ డే టూర్ లో హైదరాబాద్ మొత్తాన్ని కవర్ చేస్తారు. ఉదయం 7.30 కి బేగంపేట యాత్రి నివాస్ నుండి ఈ టూర్ ప్రారంభం అవుతుంది... తర్వాత 8 గంటలకు బషీర్ బాగ్ కు చేరుకుంటుంది. అక్కడ కూడా టూరిస్ట్ లు బస్సు ఎక్కవచ్చు. బిర్లా మందిర్ సందర్శనతో టూర్ ప్రారంభం అవుతుంది.
నాంపల్లిలో ప్రారంభమయ్యే హైదరాబాద్ టూర్ మెల్లిగా పాతబస్తీలోకి ఎంటర్ అవుతుంది. చౌమహల్లా ప్యాలెస్,చార్మినార్, మక్కా మసీదును సందర్శించవచ్చు... లాడ్ బజార్ లో చిన్న స్ట్రీట్ షాపింగ్ చేయవచ్చు. అక్కడినుండి సాలార్ జంగ్ మ్యూజియంకు తీసుకువెళతారు.
మద్యాహ్నం భోజనం తర్వాత నిజాం మ్యూజియం సందర్శించవచ్చు. అక్కడినుండి గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్ సందర్శన వుంటుంది. ఇలా హైదరాబాద్ నగరమంతా తిప్పి రాత్రి 7 లేదా 8 గంటలకు హుస్సేన్ సాగర్ తీరంలోని ఐమాక్స్ వద్ద దింపుతారు.
Hyderabad Tour Package
హైదరాబాద్ టూర్ ప్యాకేజీకి ఎంత ఖర్చవుతుంది :
హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్ ప్యాకేజీకి బస్సును బట్టి ధర వుంటుంది. ఏసి బస్ అయితే పెద్దలకు రూ.500, పిల్లలకు రూ.400 చార్జీ వుంటుంది. అదే నాన్ ఏసి బస్ అయితే పెద్దలకు రూ.380, పిల్లలకు రూ.300 చార్జ్ వుంటుంది.
సమ్మర్ లో పిల్లలతో కలిసి హైదరాబాద్ ను సందర్శించాలని అనుకునేవారు ఏసి ప్యాకేజి తీసుకోవడమే మంచింది...ఎందుకంటే నగరంలో ఎండలు మండిపోతాయి. ఒకవేళ వర్షాకాలం లేదా చలికాలం నాన్ ఏసి బస్సు కూడా సౌకర్యవంతంగానే వుంటుంది. మీ బడ్జెట్ ను బట్టి బస్సును ఎంపిక చేసుకోవచ్చు.
అయితే కేవలం బస్ చార్జీలు మాత్రమే ఈ ప్యాకేజీలో వర్తిస్తాయి. సందర్శనీయ ప్రదేశాల వద్ద ఎంట్రీ టికెట్లు, భోజనాలు,స్నాక్స్ ఖర్చులు పర్యటకులే సొంతంగా భరించుకోవాల్సి వుంటుంది. ఈ టూర్ ప్యాకేజ్ టికెట్ల కోసం తెలంగాణ టూరిజం శాఖ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.