MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Telangana
  • Telangana Assembly Elections 2023 : బిజెపి బిసి సీఎం అభ్యర్థి ఆయనేనా?

Telangana Assembly Elections 2023 : బిజెపి బిసి సీఎం అభ్యర్థి ఆయనేనా?

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రి చేస్తామని ఆ పార్టీ అదిష్టానం ప్రకటించింది. దీంతో ఆ బిసి సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  

2 Min read
Author : Arun Kumar P
| Updated : Nov 03 2023, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Eatala

Eatala

కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి బిసి సీఎం నినాదం ఎత్తుకుంది. ఇఫ్పటికే బిసిలకు అత్యధిక సీట్లు కేటాయించిన బిజెపి అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ బిసి సీఎం తన భర్త ఈటల రాజేందర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ ఈటల జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Eatala Jamuna

Eatala Jamuna

హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో ఈటల జమున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తన భర్త ఈటల రాజేందర్ కు మరోసారి మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. ఈసారి ఈటలను కేవలం ఎమ్మెల్యేగానే కాదు ముఖ్యమంత్రిగా ఈటలను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని జమున అన్నారు. కష్టసుఖాల్లో అండగా వున్న తమ సారు మళ్ళీ గెలవాలే... ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి... అనేదే ప్రజల నినాదంగా వుందని ఈటల జమున అన్నారు. 

36
BJP Eetela

BJP Eetela

హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ తప్ప మరొకరు గెలిచే అవకాశమే లేదని... ఆయనంటే ఇక్కడి ప్రజలకు అంత అభిమానమని జమున పేర్కొన్నారు. ఇప్పటికే ఏడుసార్లు హుజురాబాద్ నుండి ఈటల  గెలిచారు... ఇక ముుందు కూడా గెలిచేది ఆయనేనని అన్నారు.  ఆయనకు హుజురాబాద్ ప్రజలంటే... ప్రజలకు ఆయనంటే ఇష్టమని ఈటల జమున తెలిపారు. 

46
telangana bjp

telangana bjp

హుజురాబాద్ ప్రజలు తనను గెలిపించుకుంటారనే నమ్మకంతోనే రాజేందర్ సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు సిద్దమయ్యారని జమున తెలిపారు. హుజురాబాద్, గజ్వేల్ ఈటలకు రెండు కళ్లలాంటివని జమున అన్నారు. గత హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితమే రిపీట్ అవుతుందని ఈటల జమున తెలిపారు. 

56
KCR Eatala

KCR Eatala

ఇదిలావుంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను దెబ్బతీసేందుకు ఆయనగురించి అంతా తెలిసిన ఈటల రాజేందర్ ను వాడుకుంటోంది బిజెపి. బిఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు వహించిన అనుభవం, సీఎం కేసీఆర్ రాజకీయాలు ఎలా వుంటాయో తెలియడమే ఇప్పుడు ఈటలకు కలిసి వచ్చింది. దీంతో ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ గా ఈటలకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది బిజెపి అధిష్టానం. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడించే మరో బాధ్యతను ఈటలకు అప్పగించింది. 

66
Eatala

Eatala

ఈటలను సీఎం కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ  చేయించడం... ఇదే సమయంలో బిజెపి బిసి సీఎం నినాదం అందుకోవడంతో ప్రజల్లో కొత్త ప్రచారం ప్రారంభమయ్యింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిస్తే ఈటలనే ముఖ్యమంత్రి చేయనున్నారని ప్రచారం జోరందుకుంది. ఇదే విషయాన్ని హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో ఈటల జమున తెలిపారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Recommended image2
Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్
Recommended image3
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved