దుబ్బాక ఉప ఎన్నికలు: ఆ పార్టీలకు చావో రేవో

First Published 8, Oct 2020, 2:55 PM

తెలంగాణలో ప్రధాన పార్టీలు దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రధానంగా కేంద్రీకరించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నెలకొంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలని ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఏ పార్టీకి ఓటర్లు మద్దతిస్తారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి చెరకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావు పోటీకి దిగారు.

ఈ ఎన్నికల్లో తమ సత్తాను చాటాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 2023లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అధికారం కోసం ఇప్పటినుండే ప్రయత్నాలు చేస్తున్నాయి.

రెండు పట్టభద్రుల  ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి.

టీఆర్ఎస్ అసమ్మతి నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిగా బరిలోకి దింపింది. సోలిపేట రామలింగారెడ్డి మరణించిన తర్వాత కొందరు అసమ్మతి నేతలు సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని టికెట్టు ఇవ్వొద్దని కోరారు. టీఆర్ఎస్ లోని అసమ్మతి నేతలను తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడిస్తే రాజకీయంగా ప్రయోజనం దక్కుతోందని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి.  అయితే అధికార పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించడం అంతా ఆషామాషీ వ్యవహరం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్,బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

2018 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ మద్దుల నాగేశ్వర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత చెరుకు ముత్యం రెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో రామలింగారెడ్డి గెలుపు కోసం ముత్యం రెడ్డి పనిచేశారు.ఇటీవల కాలంలో ఆయన అనారోగ్యంతో మరణించారు.   ప్రస్తుతం ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు 26,799 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు 22,595 ఓట్లు లభించాయి. 2014లో ఇదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు ముత్యం రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 44,309 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు 15,131 ఓట్లు దక్కాయి. 2009లో ఇదే స్థానం నుండి ముత్యం రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో గతంలో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న రెండో స్థానాన్ని నిలుపుకొంటుందా... ఇంకా మెరుగైన ఫలితాలను సాధిస్తోందా అనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. బీజేపీకి ఈ నియోజకవర్గంలో 2014 నుండి ఓట్లను పెంచుకొంటూ వస్తోంది. ఈ దఫా ఓట్లు పెరుగుతాయా లేదా అనేది చూడాలి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగైన ఓట్లను సాధిస్తే టీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్నాయం అని బీజేపీ ప్రజల్లో ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది. బీజేపీ కంటే కాంగ్రెస్ గణనీయమైన ఓట్లు పొందితే బీజేపీపై ప్రజల అభిప్రాయం తేలిపోయిందని కాంగ్రెస్ ప్రజల్లో ప్రచారం చేసే అవకాశం  లేకపోలేదు.

loader