డబుల్‌ డెక్కర్‌కు రూట్‌ క్లియర్‌.. ఐదు రూట్లలో నడపనున్న ఆర్టీసీ...

First Published Dec 18, 2020, 10:15 AM IST

డబుల్ డెక్కర్ బస్సులు మరోసారి హైదరాబాద్ లో కనువిందు చేయనున్నాయి. ప్రయాణికులకు కొత్త అనుభూతికి కల్పించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులకు గ్రేటర్‌ ఆర్టీసీ ‘రూట్‌ క్లియర్‌’ చేసింది.  మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు నగరంలో ఇప్పటికే వీటిని నడపాలని ఆర్టీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

అయితే అంతకు ముందు డబుల్ డెక్కర్ లు నడిచిన కాలానికి, ఇప్పటికి నగరం చాలా మారిపోయింది. దీంతో నగరంలోని రూట్లను బాగా పరిశీలించిన తరువాత ఆర్టీసీ తాజాగా రూట్లను ఎంపిక చేసింది. గతంలో ప్రాథమికంగా నిర్ధారించిన మార్గాల్లో కొన్ని స్వల్ప మార్పులు చేసి డబుల్‌డెక్కర్‌ బస్సులను నడిపేందుకు అవకాశం ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది.

అయితే డబుల్ డెక్కర్ లను నిషేధించకముందు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండబోతోందో ఒకసారి పరిశీలిస్తే..

అప్పట్లో ఒక డ్రైవర్, ఇద్దరు కండక్టర్లు ఉండే డబుల్‌ డెక్కర్‌ బస్సులను సికింద్రాబాద్‌ నుంచి జూపార్కు వరకు ఎక్కువగా నడిపేవారు. మెహిదీపట్నం, అఫ్జల్‌గంజ్‌ రూట్లలో కూడా రాకపోకలు సాగించాయి.  అంతేకాదు సిటీకి వచ్చే పర్యాటకులను ఆకట్టుకొనేలా సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా చార్మినార్‌ వరకు ఈ బస్సులు నడిచేవి.

నగరంలో 2002 వరకు ఎక్కువగా ఇవి నడిచాయి. అప్పటికే అనేక మార్గాల్లో ఫ్‌లైఓవర్లు రావడంతో డబుల్‌డెక్కర్‌ బస్సుల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. సికింద్రాబాద్‌– మెహిదీపట్నంల మధ్య ఒక బస్సును 2004 వరకు కూడా నడిపారు. కానీ అప్పటికే ఈ బస్సులు చాలావరకు కాలం చెల్లినవి కావడం, మరోవైపు ఫ్‌లైఓవర్ల వల్ల నిర్వహణ కష్టం కావడంతో పక్కకు పెట్టేశారు.

ఇక ఇప్పుడు మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్లెక్కబోతున్నందున కొత్త హంగులు, కొత్త రూట్లు, కొత్త ప్రణాళికతో ముందుకు రాబోతున్నాయి. గతంలో పర్యాటక ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని డబుల్‌ డెక్కర్‌ బస్సులను ఏర్పాటు చేశారు. అయితే అప్పటికీ, ఇప్పటికీ హైదరాబాద్‌ ఎంతో విస్తరించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ నగర హంగులను వీక్షించేలా డబుల్ డెక్కర్ రూట్లు ఉండబోతున్నాయి.

మొదటిది సికింద్రాబాద్‌ నుంచి సుచిత్ర మీదుగా మేడ్చల్‌కు వెళ్లే క్రమంలో  ప్యారడైజ్, జూబ్లీ బస్‌స్టేషన్‌లతో పాటు మెట్రో రైళ్ల పరుగులు ఆకట్టుకుంటాయి.

ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సికింద్రాబాద్‌– పటాన్‌చెరు రూట్‌లో తాడ్‌బండ్‌ ఆంజనేయస్వామి ఆలయం, బాలానగర్‌ చౌరస్తా, జేఎన్‌టీయూ వర్సిటీ తదితర ప్రాంతాలు కనిపిస్తాయి.

కోఠి నుంచి పటాన్‌చెరు వెళ్లే రూట్‌లో హైదరాబాద్‌ పాత కొత్త ప్రాంతాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. అబిడ్స్, కోఠి వంటి  పాతకాలపు మార్కెట్లు, పబ్లిక్‌గార్డెన్స్, అసెంబ్లీ భవనం, లక్డికాపూల్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి తారసపడతాయి.

ఇక ఐదో రూట్ లో అఫ్జల్‌గంజ్‌– మెహిదీపట్నం పూర్తిగా హైదరాబాద్‌ పురాతన సౌందర్యం చూడొచ్చు. నాంపల్లి రైల్వేస్టేషన్, విజయనగర్‌ కాలనీ, మాసాబ్‌ట్యాంక్‌ వంటి ప్రాంతాలు కనిసిస్తాయి.

గౌలిగూడలోని సెంట్రల్‌ బస్‌స్టేషన్‌ నుంచి జాంబాగ్‌ పండ్ల మార్కెట్, కరాచీ బేకరీ, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ వంటి చారిత్రక ప్రదేశాలు సీబీఎస్‌–జీడిమెట్ల రూట్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సు నుంచి కనిపిస్తాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?