సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలను వినియోగిస్తున్నాయి.అధికారం దక్కించుకొనేందుకు ఇతర పార్టీలతో కూటమి ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ తీరుపై లెఫ్ట్ పార్టీలు కొంత అసంతృప్తితో ఉంది.
సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
సీపీఐ, సీపీఎంలు తలో దారి పట్టాయి. గత ఎన్నికల సమయంలో మాదిరిగానే వేర్వేరు దారుల్లో పయనిస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాలని సీపీఐ దాదాపుగా నిర్ణయానికి వచ్చింది. ఒంటరిగానే సీపీఎం బరిలోకి దిగుతుంది.
సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు పలు దఫాలు చర్చించాయి. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏ పార్టీ ఏ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలనే విషయాలపై ఈ రెండు పార్టీలు చర్చించాయి.
సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలకు స్నేహహస్తం అందించింది. ఈ రెండు పార్టీలకు సీట్ల సర్దుబాటు విషయమై రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పలు దఫాలు చర్చలు జరిగాయి. సీట్ల సర్ధుబాటు విషయమై కాంగ్రెస్ అనుసరించిన తీరుపై సీపీఎం అసంతృప్తితో ఉంది. ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
గత నెల 31న సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం, ఈ నెల 1న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించిన తీరుపై సీపీఎం మండిపడింది. ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ నెల 2న ప్రకటించారు. ఇవాళ 14 మందితో అభ్యర్థుల జాబితాను సీపీఎం విడుదల చేసింది.ఈ ఎన్నికల్లో ఒంటరిగా సీపీఎం బరిలోకి దిగుతుంది.
సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
కాంగ్రెస్ పార్టీతో సీపీఐ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని సీపీఐకి కాంగ్రెస్ ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసింది.అధికారంలోకి వస్తే ఓ ఎమ్మెల్సీని కూడ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయమై రెండు పార్టీలు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
2018 ఎన్నికల సమయంలో కూడ మహాకూటమిలో సీపీఐ భాగస్వామిగా ఉంది.కాంగ్రెస్, టీడీపీ, జనసేన, సీపీఐ ఈ కూటమిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో సీపీఎం మాత్రం బహుజన లెఫ్ట్ ప్రంట్ ను ఏర్పాటు చేసింది.
సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కు చైర్మెన్ గా నల్లా సూర్యప్రకాష్ రావు, కన్వీనర్ గా తమ్మినేని వీరభద్రం వ్యవహరించారు.గత ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున ఒక్క అభ్యర్ధి కూడ విజయం సాధించలేదు. ఈ తరహా ప్రయోగం సరైంది కాదని సీపీఎం గుర్తించింది. గత ఎన్నికల్లో సీపీఐకి ఒక్క స్థానం కూడ దక్కలేదు.
సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
2022 అక్టోబర్ మాసంలో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. బీజేపీని ఓడించేందుకు గాను ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి. మునుగోడు ఉప ఎన్నికలతో పాటు వచ్చే ఎన్నికల్లో కూడ లెఫ్ట్ పార్టీలతో పొత్తు కొనసాగుతుందని కేసీఆర్ ఆనాడు ప్రకటించారు.
సీపీఐ, సీపీఎం చేరో దారి: 2018లో అలా... ఇప్పుడిలా..
ఈ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉండదని కేసీఆర్ తేల్చి చెప్పారు. మిత్రపక్షాలుగా ఉన్న సీపీఐ, సీపీఎంలతో సంప్రదించకుండానే 115 మందితో అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటనతో లెఫ్ట్ పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ పరిణామంతో లెప్ట్ పార్టీలతో కాంగ్రెస్ చర్చలను ప్రారంభించిన విషయం తెలిసిందే.