గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్
సర్వే ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఈ విషయమై సర్వే నిర్వహిస్తుంది.
గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్
ఏ స్థానంలో ఏ అభ్యర్ధిని బరిలోకి దింపితే విజయం సాధిస్తారనే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సర్వేలు నిర్వహిస్తుంది. సర్వేల ఆధారంగానే టిక్కెట్లను కేటాయించనున్నారు.. ఢిల్లీలో తమకు పరిచయాలుంటే టిక్కెట్లు దక్కవని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే తేల్చి చెప్పారు.
గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్
ఈ నెల 22న జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో మాణిక్ రావు ఠాక్రే ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎంత గొప్ప నాయకుడైనా సర్వే ఆధారంగానే టిక్కెట్లను కేటాయించనున్నట్టుగా మాణిక్ రావు ఠాక్రే తేల్చి చెప్పారు.
గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్
తనతో సహా ఏ అభ్యర్ధికైనా సర్వేనే ప్రామాణికమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. పొత్తులపై ఎన్నికల సమయంలోనే నిర్ణయాలుంటాయని ఆయన వివరించారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ ప్రకటించారు.
గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ను నింపాయి.
గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్
తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పట్టుదలగా ఉంది. ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు
గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్
రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల నేతలతో కాంగ్రెస్ నాయకత్వం చర్చించనుంది. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ నాయకత్వం దిశా నిర్దేశం చేయనుంది.
గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సునీల్ టీమ్ రాహుల్ గాంధీకి సమాచారం ఇస్తుంది. సునీల్ టీమ్ ఇచ్చే సమాచారం ఆధారంగానే కాంగ్రెస్ నాయకత్వం వ్యూహరచన చేస్తుంది.
గెలుపు గుర్రాలకే సీట్లు: సర్వే ఆధారంగానే టిక్కెట్లకు కాంగ్రెస్ ప్లాన్
గత ఏడాది రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. సునీల్ టీమ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలతో చర్చించారు.