కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు: బీజేపీ నేతలకు గాలం, వలస నేతలకు టిక్కెట్లు
కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ ఇవాళ జరుగుతుంది.ఈ సమావేశంలో రెండో అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలపనుంది.
కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు: బీజేపీ నేతలకు గాలం, వలస నేతలకు టిక్కెట్లు
తెలంగాణలో అధికారాన్ని దక్కించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. బీజేపీలోని అసంతృప్త నేతలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తుంది.
కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు: బీజేపీ నేతలకు గాలం, వలస నేతలకు టిక్కెట్లు
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిలను హస్తం పార్టీ ఆహ్వానించింది. బీజేపీ నాయకత్వం తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. దీంతో వీరిద్దరూ బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.
కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు: బీజేపీ నేతలకు గాలం, వలస నేతలకు టిక్కెట్లు
ఈ నెల 22న బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామిలకు చోటు దక్కలేదు. కానీ ఈటల రాజేందర్ కు బీజేపీ నాయకత్వం రెండు స్థానాలు కేటాయించింది. గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు హుజూరాబాద్ నుండి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు.
కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు: బీజేపీ నేతలకు గాలం, వలస నేతలకు టిక్కెట్లు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడ రెండు అసెంబ్లీ స్థానాలు కోరుతున్నారు. మునుగోడు నుండి తన భార్యను, ఎల్ బీ నగర్ నుండి తాను బరిలోకి దిగాలని భావిస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కానీ బీజేపీ నాయకత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తొలి జాబితాలో చోటు కల్పించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడాలని భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది.
కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు: బీజేపీ నేతలకు గాలం, వలస నేతలకు టిక్కెట్లు
బీజేపీలోని అసంతృప్త నేతలకు కాంగ్రెస్ నేతలు టచ్ లోకి వెళ్లారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపారనే ప్రచారం లేకపోలేదు. కాంగ్రెస్ నుండి తనను పోటీ చేయాలని తన అనుచరులు కోరుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. తన నిర్ణయాన్ని రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నట్టు వెల్లడించారు.
కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు: బీజేపీ నేతలకు గాలం, వలస నేతలకు టిక్కెట్లు
కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతుంది.ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగే అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్ర పడనుంది. అయితే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి వలసలు చోటు చేసుకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండో జాబితాను 30 మందికే కుదించాలని కాంగ్రెస్ భావిస్తుంది. మిగిలిన అభ్యర్థుల పేర్లను మూడో జాబితాలో చేర్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు: బీజేపీ నేతలకు గాలం, వలస నేతలకు టిక్కెట్లు
బీజేపీ సహా ఇతర పార్టీల నుండి వలస వచ్చే నేతలకు అవకాశం కల్పించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అభ్యర్థుల జాబితా విడుదలలో ఆలస్యం చేస్తుందనే ప్రచారం కూడ సాగుతుంది. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు సర్వే ఫలితాలకు అనుగుణంగా టిక్కెట్లను కేటాయిస్తున్నారు.
కాంగ్రెస్ వ్యూహత్మక అడుగులు: బీజేపీ నేతలకు గాలం, వలస నేతలకు టిక్కెట్లు
ఇదిలా ఉంటే సీపీఐ, సీపీఎంల సీట్ల సర్ధుబాటు విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రెండు పార్టీలకు రెండేసీ అసెంబ్లీ స్థానాలను కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. మిర్యాలగూడతో పాటు వైరా అసెంబ్లీ స్థానాలను సీపీఎంకు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తుంది. చెన్నూరు బదులుగా మునుగోడు స్థానాన్ని తమకు కేటాయించాలని సీపీఐకి చెందిన నల్గొండ జిల్లా నేతలు కోరుతున్నారు. ఖమ్మంలో వైరాకు బదులుగా పాలేరు ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతుంది.