రంగంలోకి జానారెడ్డి: నాగార్జునసాగర్‌లో 'దుబ్బాక' రిపీట్ కాకుండా కాంగ్రెస్ ప్లాన్

First Published Jan 12, 2021, 12:16 PM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది. గత ఎన్నికల  అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకొంటుంది.

వరుస ఎన్నికల్లో ఓటములతో ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. పీసీసీకి కొత్త చీఫ్ ను నియమించాలని డిమాండ్ నెలకొంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం కోసం పార్టీ నాయకత్వం  కసరత్తును కూడా ప్రారంభించింది.

పీసీసీ చీఫ్ కొత్త బాస్ ఎంపిక విషయంలో సీనియర్లు, జూనియర్ల మధ్య కొంత అగాధం నెలకొంది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వరకు పీసీసీ చీఫ్ ఎంపిక విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా వాయిదా వేసింది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు కొత్తబాస్ ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికలకు ముందే కొత్త బాస్ ను ప్రకటిస్తే ఎన్నికలపై దాని ప్రభావం ఉండే అవకాశం ఉందని భావించిన కాంగ్రెస్ నాయకత్వం  జాగ్రత్త తీసుకొంది.

పీసీసీ చీఫ్ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ ఛైర్మెన్  పదవులను ఒకే సామాజిక వర్గానికి కేటాయించవద్దని కూడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు.

దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత టీపీసీసీకి కొత్త బాస్ వచ్చే అవకాశం ఉంది.  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి జానారెడ్డి పోటీ చేయనున్నారు.

2018 ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహ్మయ్య 7 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికల్లో విజయం  కోసం కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అన్ని రకాల శక్తులను కూడదీసుకొంటుంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చలకుర్తి, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి మాజీ మంత్రి జానారెడ్డి ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ గత ఎన్నికలతో పాటు 1994లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని ప్రకటించలేదు. టీఆర్ఎస్  నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీటిచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికే పరిమితమైంది.

నాగార్జునసాగర్  స్థానంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది ఉంది. అయితే జానారెడ్డికి చెందిన కీలకమైన అనుచరులు గతంలోనే టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఈ పరిణామం జానారెడ్డికి కొంత ఇబ్బంది కల్గించే పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

నోముల నర్సింహ్మయ్య బతికున్న కాలంలో కొందరు పార్టీ నేతలతో ఆయనకు పొసగలేదు. ఉప ఎన్నికల్లో నర్సింహ్మయ్య కుటుంబసభ్యులకు సీటివ్వాలనే డిమాండ్ ఉంది. నర్సింహ్మయ్య వ్యతిరేక వర్గం కూడ  పోటీకి సన్నాహలు చేసుకొంటుంది.

ఈ స్థానం నుండి ఎవరిని పోటీకి దింపుతామనే విషయమై టీఆర్ఎస్ నాయకత్వం స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ నుండి నివేదితతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన మరో నేత కూడ పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఈ రెండు పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్ధులపై స్పష్టత రాలేదు.

కానీ గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ముందుగానే అభ్యర్ధిని ప్రకటించింది. జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటనను ప్రారంభించారు.

కొంతకాలంగా నియోజకవర్గంలోని తన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నేతలతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఫంక్షన్లు, ఇతర  కార్యక్రమాల్లో జానారెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు.

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జానారెడ్డి నియోజకవర్గానికి  దూరంగా ఉన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున జానారెడ్డి నాగార్జునసాగర్ కు మకాం మార్చారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?