మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ కు ఆధిక్యత ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కరే సభ్యుడున్నాడు. తెలంగాణలో అధికారం దక్కించుకున్న బిల్లులు పాస్ కావాలంటే మండలిలో కాంగ్రెస్ కు మెజారిటీ దక్కాల్సి ఉంది.
మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. శాసనసభలో కూడ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా మెజారిటీ లేదు. ఇక తెలంగాణ శాసనమండలిలో భారత రాష్ట్ర సమితికే ఆధిక్యత ఉంది. శాసనమండలిలో భారత రాష్ట్ర సమితికి 28 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఒక్కరు మాత్రమే ఉన్నారు.
మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
తెలంగాణ శాసనసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందినా శాసనమండలిలో ఆమోదం పొందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నల్లేరు మీద నడకగా పరిస్థితులు లేవు. శాసనసమండలిలో ఉన్న సభ్యులు 2025లో ఎక్కువ మంది రిటైరయ్యే అవకాశం ఉంది.
మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు. అయితే ఇందులో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గవర్నర్ కోటా కింద రెండు స్థానాలున్నాయి. ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన పోలింగ్ లో నలుగురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు
మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరిలు హుజూరాబాద్, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నుండి గెలుపొందారు. ఈ ముగ్గురు కూడ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా గతంలో గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి కసిరెడ్డి నారాయణ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపొందారు.
మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా రాజీనామా చేయలేదు.
మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
తెలంగాణ శాసనమండలిలో బీజేపీకి ఒక్కరు, ఎంఐఎంకు ఇద్దరు, ఇండిపెండెంట్ కు ఒక్కరున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాత్రమే మండలిలో ఉన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మండలిలో కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. అయితే దామోదర్ రెడ్డిపై అనర్హత వేటేయాలని బీఆర్ఎస్ నాయకత్వం మండలి చైర్మెన్ కు ఫిర్యాదు చేసే అవకాశం లేకపోలేదు.
మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా బిల్లును పాస్ చేయించుకున్నా శాసమండలిలో బిల్లు పాస్ కావాలంటే కష్టమే. తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ కు 28 మంది సభ్యులున్నారు. ఏ బిల్లు పాస్ కావాలన్నా బీఆర్ఎస్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కు నెలకొంది. ఈ పరిణామం కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందికరమే. అయితే ఈ పరిస్థితిని కాంగ్రెస్ నాయకత్వం ఎలా అధిగమిస్తుందో చూడాలి.
మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయంలో ఆనాడు ఆ రాష్ట్ర శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సభ్యులున్నారు. దీంతో అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన బిల్లులను తెలుగుదేశం పార్టీ నిలువరించింది. మూడు రాజధానుల బిల్లును అప్పట్లో శాసనమండలి తిప్పి పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శాసనమండలిలో వైఎస్ఆర్‌సీపీ తన బలాన్ని పెంచుకుంది.
మండలిలో బీఆర్ఎస్‌కు మెజారిటీ: తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సీన్ రీపీట్?
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు తెలంగాణలో పునరావృతమయ్యే అవకాశాలు లేకపోలేదు. రేవంత్ రెడ్డి సర్కార్ కు మండలిలో ఇబ్బందులు తప్పకపోవచ్చనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు