జానారెడ్డితో మరోసారి సంప్రదింపులు, ఢిల్లీకి జీవన్ రెడ్డి: టీపీసీసీ చీఫ్ ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్ష్
First Published Dec 29, 2020, 1:35 PM IST
టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.ఈ నెలాఖరు నాటికి కొత్త నేతను ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటన నేపథ్యంలో కొత్త నేత ఎంపిక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో పార్టీ అధిష్టానం మరోసారి సంప్రదింపులు జరుపుతోంది. ఈ నెలాఖరు వరకు టీపీసీసీ చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే రాహుల్ గాంధీ ఇటలీ పర్యటనలో ఉన్నందున టీపీసీసీ చీఫ్ ప్రకటన విషయం ఆలస్యమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీకి ఐదుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ ఇచ్చాడు. ఈ ఐదుగురు పేర్లలో ఇద్దరి పేర్లను కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను ప్రధానంగా పరిశీలిస్తోందని ప్రచారం సాగుతోంది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కల మధ్య పోటీ నెలకొందని ప్రచారం సాగుతోంది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?