Christmas Holidays 2025 : ఈసారి ఒకటి రెండ్రోజులు కాదు.. ఏకంగా ఐద్రోజులు సెలవులు..?
Christmas Holidays : క్రిస్టియన్లు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ క్రిస్మస్. ఈ పండక్కి అధికారికంగా ప్రకటించిన రెండ్రోజులు కాదు ఏకంగా ఐదురోజులు సెలవు పొందవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులు
Christmas Holidays : 2025 సంవత్సరం ముగింపుకు చేరుకుంది... సరిగ్గా నెలరోజుల్లో 2026 లో అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది పండగలు, పర్వదినాలు, జాతీయ వేడుకలు, వర్షాలు, బంద్ లు... ఇలా అనేక సెలవులు వచ్చాయి... న్యూఇయర్ తో ప్రారంభమైన సెలవులు క్రిస్మస్ తో ముగియనున్నాయి. అయితే ఇయర్ ఎండ్ లో వచ్చే క్రిస్మస్ కి కేవలం ఒకటి రెండ్రోజులే సెలవులున్నాయి... వీటిని నాలుగైదు రోజుల సెలవులుగా మార్చుకోవచ్చు. క్రిస్మస్ కి ఎక్కువరోజులు సెలవులు పొందడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో క్రిస్మస్ సెలవులు
ప్రతి ఏడాది క్రిస్మస్ సెలవులతోనే ముగుస్తుంది... 2025 కూడా అలాగే ముగుస్తోంది. దేశంలోని క్రిస్టియన్స్ ఎంతో భక్తిశ్రద్దలతో తమ ఆరాధ్యదైవం ఏసుక్రీస్తు కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేస్తుంటారు.. ఘనంగా వేడుకలు జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 25 (గురువారం) తెలంగాణలో విద్యాసంస్థలు, ఉద్యోగులకు అధికారికంగా సెలవు ఇచ్చింది ప్రభుత్వం.
డిసెంబర్ 26 (శుక్రవారం) అంటే క్రిస్మస్ తర్వాతిరోజు భాక్సింగ్ డే. ఈరోజు కూడా తెలంగాణలో అధికారిక సెలవే. ఇలా క్రిస్మస్ పండక్కి వరుసగా రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి. అయితే ఈ క్రిస్మస్ సెలవులను ఐద్రోజులకు పొడిగించుకోవచ్చు.
క్రిస్మస్ పండక్కి మందురోజు (డిసెంబర్ 24, క్రిస్మస్ ఈవ్) కి తెలంగాణ ప్రభుత్వం ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. అవసరం అనుకుంటే ఉద్యోగులు ఈ సెలవులను పొందవచ్చు. ఇక డిసెంబర్ 27 శనివారం ఒక్కరోజు మేనేజ్ చేసుకుంటే చాలు డిసెంబర్ 28 ఎలాగూ ఆదివారమే. ఇలా కావాలనుకుంటే రెండ్రోజుల క్రిస్మస్ సెలవులను ఐద్రోజులకు పొడిగించుకోవచ్చు.
ఏపీలో క్రిస్మస్ సెలవులు
ఆంధ్ర ప్రదేశ్ లో క్రిస్మస్ పండక్కి కేవలం ఒక్కరోజే (డిసెంబర్ 25న) అధికారికంగా సెలవు ఉంది. కానీ క్రిస్మస్ కి ముందురోజు (డిసెంబర్ 24, క్రిస్మస్ ఈవ్), తర్వాతిరోజు (డిసెంబర్ 26, భాక్సింగ్ డే) ఐచ్చిక సెలవుగా ప్రకటించారు. అంటే ఉద్యోగులు ఈ రెండ్రోజులు కూడా అవసరం అనుకుంటే సెలవు పొందవచ్చు... క్రిస్టియర్ ఉద్యోగులు ఈ సెలవులను వాడుకునే అవకాశాలున్నాయి.
ఇలా క్రిస్మస్ కి మూడ్రోజులు అధికారికంగా సెలవు పొందేవారు డిసెంబర్ 27 (శనివారం) కవర్ చేస్తే మరో సెలవు కలిసివస్తుంది. డిసెంబర్ 28 ఆదివారం సెలవే... ఇలా ఏపీ ఉద్యోగులు కూడా క్రిస్మస్ పండక్కి ఐదు రోజులు సెలవులు పొందవచ్చు.
డిసెంబర్ సెలవులు
డిసెంబర్ లో మొత్తం 31 రోజులకు గాను తెలంగాణలో ఏడు, ఏపీలో ఆరు రోజుల సెలవులున్నాయి... ఐచ్చిక సెలవులు కూడా కలుపుకుంటే వీటిసంఖ్య పెరుగుతుంది. డిసెంబర్ 7,14, 21, 28 ఆదివారం సెలవులు... 13 రెండో శనివారం సెలవు. ఇక క్రిస్మస్ కి తెలంగాణలో డిసెంబర్ 25, 26 రెండ్రోజులు... ఏపీలో డిసెంబర్ 25 ఒకేరోజు సెలవులున్నాయి. కొన్ని ప్రైవేట్ సంస్థలు డిసెంబర్ 31 ఇయర్ ఎండింగ్ సందర్భంగా సెలవులు ఇచ్చే అవకాశాలున్నాయి... అంటే కొందరికి మరో సెలవు అదనంగా వస్తుందన్నమాట.
టూర్స్ కి సరైన సమయం
క్రిస్మస్ పండగ, తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్... ఉద్యోగులకే కాదు విద్యార్థులకు కూడా వరుస సెలవులు ఉంటాయి. ఈ సమయంలో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీ లేదంటే స్నేహితులతో కలిసి మంచి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. హాయిగా నాలుగైదు రోజులు ఉద్యోగులైతే జాబ్ టెన్షన్స్, మహిళలు ఇంటిపని, విద్యార్థులు చదువు ఒత్తిళ్లకు దూరంగా హాయిగా గడపొచ్చు.

