- Home
- Telangana
- Business Plan : తెలుగోళ్లకు గోల్డెన్ ఛాయిస్.. లక్షల పెట్టుబడితో కోట్లు సంపాదించే సూపర్ బిజినెస్, నష్టాలే ఉండవు
Business Plan : తెలుగోళ్లకు గోల్డెన్ ఛాయిస్.. లక్షల పెట్టుబడితో కోట్లు సంపాదించే సూపర్ బిజినెస్, నష్టాలే ఉండవు
Business Plans : తెలుగు ప్రజలకు అద్భుత అవకాశం. లక్షల పెట్టుబడితో కోట్లాది రూపాయల టర్నోవర్ కలిగిన వ్యాపారం చేసే గోల్డెన్ ఛాయిస్. ఆ వ్యాపారమేంటో ఇక్కడ తెలుసుకుందాం.

నష్టమన్నదే లేని సూపర్ బిజినెస్
Business Plan : ఉద్యోగాలతో విసిగిపోయి కొందరు... అసలు ఉద్యోగ అవకాశాలే రాక మరికొందరు వ్యాపారం చేయాలని భావిస్తుంటారు. కానీ బిజినెస్ లో కూడా విపరీతమైన పోటీ ఉంటుంది... అన్ని రంగాల్లో కార్పోరేట్ సంస్థలు ఎంటరవుతున్నాయి. కాబట్టి వ్యాపారాలు చేసి లాభపడేవారికంటే నష్టపోయేవారే ఎక్కువగా ఉంటున్నారు. అయితే కొన్ని వ్యాపారాల్లో ఎంత పోటీ ఉన్నా కొత్తవారికి స్పేస్ ఉంటుంది... తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఓ అద్భుతమైన బిజినెస్ చేసేందుకు తెలుగు ప్రజలకు మరీముఖ్యంగా తెలంగాణవారికి అవకాశం వచ్చింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో వైన్ షాప్ పెట్టే అవకాశం
తెలంగాణ ప్రభుత్వం కొత్త వైన్ షాపుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది... ఇవాళ్టి (సెప్టెంబర్ 26, శుక్రవారం) నుండే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభించారు. వచ్చే రెండేళ్ల కాలానికి అంటే 1 డిసెంబర్ 2025 నుండి 30 నవంబర్ 2027 వరకు కొత్తగా వైన్స్ లైసెన్స్ పొందినవారు మద్యంవ్యాపారం చేసుకోవచ్చు. కాబట్టి మంచి ఆదాయముండే ఈ వ్యాపారాన్ని మీరు చేయాలనుకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు... అదృష్టం కలిసివస్తే మీరు వైన్ షాప్ ఓనర్ గా మారిపోవచ్చు.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే తెలంగాణలో గౌడ్, ఎస్సి, ఎస్టిలకు ఈ వైన్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు ఉన్నాయి. కల్లు అమ్మకమే కులవృత్తిగా కలిగిన గౌడ్స్ కు 15శాతం రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే షెడ్యూల్డ్ కులాల (SC) వారికి 10 శాతం, షెడ్యూల్డ్ తెగల (ST) వారికి 5 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఇది మద్యం వ్యాపారం చేయాలనుకునే బిసి, ఎస్సి, ఎస్టిలకు అద్భుత అవకాశం.
తెలంగాణలో వైన్స్ షాప్ పెట్టాలంటే ఏం చేయాలి?
తెలంగాణ ప్రభుత్వం రెండేళ్లకోసం రాష్ట్రంలోని అన్ని వైన్ షాపుల లైసెన్సులు రద్దుచేసి కొత్త లైసెన్సుల జారీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇలా 2025-2027 సంవత్సరానికి మద్యం వ్యాపారం చేసుకునేందుకు కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు సిద్దమయ్యింది ప్రభుత్వం. కాబట్టి రూ.3,00,000 దరఖాస్తు ఫీజు చెల్లించి వైన్ షాప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓ వ్యక్తి లేదా ఓ సంస్థ ఎన్ని వైన్ షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు... కానీ ప్రతి దరఖాస్తుకు 3 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వైన్స్ లైసెన్స్ దక్కకపోయినా ఈ డబ్బులు తిరిగి ఇవ్వబడవు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిర్ణీత ప్రాంతాల్లో మద్యం షాపుల ఏర్పాటుకు అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం ఆ దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్ 23న డ్రా పద్దతిలో ఎవరికి లైసెన్స్ ఇవ్వాలో నిర్ణయిస్తారు ఎక్సైజ్ శాఖ ఈ ప్రక్రియను చాలా పారదర్శకంగా నిర్వహిస్తుంది... కాబట్టి ఎవరి లక్ బాగుంటే వారికే ఈ డ్రా ద్వారా లైసెన్స్ పొంది వైన్స్ పెట్టుకునే అవకాశం వస్తుంది.
మద్యం వ్యాపారంలో లాభాలే లాభాలు
అక్టోబర్ 23న జరిగే డ్రాలో వైన్ షాప్ ఏర్పాటుకు లైసెన్స్ పొందినవారు రాబోయే రెండేళ్ళపాటు మద్యం వ్యాపారం చేయవచ్చు. ఇలా ఈ డిసెంబర్ నుండే తమ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు... 2027 నవంబర్ 30 వరకు వీరికి వైన్ షాప్ నడిపించుకునే అవకాశం ఉంటుంది.
అయితే గతంలో వైన్స్ ఏర్పాటుకు దరఖాస్తు ఫీజు రూ.2,00,000 ఉండేది.. కానీ రేవంత్ సర్కార్ లక్ష రూపాయలు పెంచి రూ.3,00,000 చేసింది. అయినప్పటికీ భారీగా దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. మద్యం వ్యాపారంలో బారీగా లాభాలు ఉండటంతో కొన్ని బడా సంస్థలు కూడా భారీగా దరఖాస్తులు చేస్తుంటాయి. ఇలా లైసెన్స్ కోసమే కోట్లు ఖర్చే చేస్తారంటే ఈ వ్యాపారంలో ఎంత లాభం ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజే కాదు ఏటా ఈ ట్యాక్స్ కూడా...
వైన్స్ ఏర్పాటుకు దరఖాస్తు ఫీజే కాకుండా లైసెన్స్ పొందినవారు ప్రతిఏటా ఎక్సైజ్ ట్యాక్ చెల్లించాల్సి ఉంటుంది. 5 వేలలోపు జనాభా కలిగివుండే ప్రాంతంలో వైన్స్ ఉంటే రూ.50 లక్షలు, 5000-50,000 లోపు జనాభా కలిగిన ప్రాంతంలో అయితే రూ.55 లక్షలు, 50 వేల నుండి లక్షలోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో అయితే రూ.60 లక్షలు చెల్లించాలి. ఇక లక్ష నుండి 5 లక్షల లోపు జనాభా ప్రాంతంలో రూ.65 లక్షలు, 5 నుండి 20 లక్షలలోపు జనాభా ప్రాంతంలో రూ.85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా కలిగిన ప్రాంతంలో కోటి పదిలక్షలు రిటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ (RSET) చెల్లించాలి.
వైన్ షాపుల దరఖాస్తుకు ఎవరు అనర్హులు
ఎక్సైజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడినవారు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. అలాగే 21 ఏళ్లలోపు వయసు కలిగిన యువత కూడా వైన్స్ నిర్వహణకు అనర్హులు. ఎక్సైజ్ శాఖ డిఫాల్టర్ గుర్తించినవారు, కోర్టుల ద్వారా దివాళా తీసినట్లు గుర్తింపబడినవారు వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ పేర్కొంది.