బంజారా మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
నిజామాబాద్ జిల్లాలో ఆదివారం బంజారా భవన్ నిర్మాణానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బంజారా మహిళలతో కలిసి కవిత నృత్యం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
kavitha
ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను గత ప్రభుత్వాలు పక్కదారి పట్టించేవని కవిత దుయ్యబట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రూ.90 వేల కోట్లను ఎస్టీ సబ్ ప్లాన్‌కు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణయే అన్నారు.
kavitha
ఒక్క నిజామాబాద్‌లోనే 8 వేలమంది గిరిజన విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించామని కవిత పేర్కొన్నారు. 198 మోడల్స్ స్కూల్స్‌ను తెలంగాణలో కొత్తగా కట్టామని ఎమ్మెల్సీ తెలిపారు. వాటిని జూనియర్ కాలేజీలుగా కన్వర్ట్ చేస్తున్నామని ఆమె వెల్లడించారు.
kavitha
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 90 స్కూళ్లు పెడితే.. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 190 స్కూళ్లు పెట్టామని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో డిగ్రీ కాలేజీలు నిర్మించామని.. వీటిలో ఎస్టీలకు ప్రత్యేకంగా నెలకొల్పామన్నారు.
kavitha
ప్రతి తండాను గ్రామ పంచాయతీగా చేశామని, రోడ్లు వేశామని కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కారణంగా తండాలకు మహిళలే సర్పంచ్‌లు కాబోతున్నారని ఆమె వెల్లడించారు.