MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • పశ్చిమ బెంగాల్ లో గెలుపు వ్యూహమే తెలంగాణలో.. బిజెపి ప్లాన్ ఇదే : సీఎం రేవంత్ సంచలనం

పశ్చిమ బెంగాల్ లో గెలుపు వ్యూహమే తెలంగాణలో.. బిజెపి ప్లాన్ ఇదే : సీఎం రేవంత్ సంచలనం

బిజెపి తెలంగాణలో పాగా వేయాలని చూస్తోందా? ఇందుకు SIR ప్రక్రియను ఉపయోగించుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో గెలుపుకోసం బిజెపి ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో బైటపెట్టారు.

4 Min read
Author : Arun Kumar P
Published : Sep 05 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కొడంగల్ కు ఎందుకింత ప్రత్యేకం అంటే..
Image Credit : Gemini AI

కొడంగల్ కు ఎందుకింత ప్రత్యేకం అంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాలు, ఓటర్ల జాబితా, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సీఎం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాగే కొడంగల్ ప్రజలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని ఆదరించడం వల్లే ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించిందని రేవంత్ రెడ్డి అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్‌కు ఉన్న ప్రాధాన్యంను ఆయన ప్రస్తావించారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు అక్కడి ప్రజలతో నిరంతరం అనుబంధాన్ని కొనసాగించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

స్థానిక కార్యకర్తలు, నాయకులు పార్టీకి బలమైన పునాది అని సీఎం అన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం పనిచేయాలని నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
SIR పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర
Image Credit : X/revanth_anumula

SIR పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న SIR ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని ఓటర్ల జాబితాలో మార్పులు చేస్తున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. గతంలో మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.

తెలంగాణలో ఓట్ల తొలగింపు ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఓట్లు ఎలాంటి కారణంతోనూ అన్యాయంగా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ప్రతి ఓటు విలువైనదేనని, తమ ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అదే సమయంలో ప్రజల ఓట్లను రక్షించాల్సిన బాధ్యత పార్టీ ముఖ్య నాయకులపై కూడా ఉందని పేర్కొన్నారు. అందుకే గ్రామాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుని ఓటర్ల జాబితాను పరిశీలించాలని సూచించారు. ప్రతి మండలంలోని నాయకులు తమ పరిధిలోని ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. నాలుగు గ్రామాలకు ఒక నాయకుడు బాధ్యత తీసుకుని, ప్రతి బూత్‌లో ఒక్క అర్హమైన ఓటు కూడా తొలగిపోకుండా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఈడీ, సీబీఐ నుంచి ఓట్ల తొలగింపు వరకు..

గతంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు బిజెపి కేంద్ర దర్యాప్తు సంస్థల సిబిఐ, ఈడిని ఉపయోగించేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇప్పుడు ఓటర్ల జాబితాలో మార్పుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. చిన్నచిన్న తప్పిదాలను కారణంగా చూపి పేదల ఓట్లను తొలగించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్ కూడా బీజేపీకి సహకరిస్తోందని సీఎం ఆరోపించారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలో ఓటర్ల హక్కులను కాపాడుకోవడంలో కాంగ్రెస్ శ్రేణులు కీలక పాత్ర పోషించాలని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను పరిశీలించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి చేస్తున్నాయంటున్న రాజకీయ ప్రయత్నాలను కాంగ్రెస్ కార్యకర్తలు సమర్థంగా ఎదుర్కోవాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

33
కొడంగల్‌లో గురుపూజోత్సవంలో సీఎం రేవంత్
Image Credit : X/revanth_anumula

కొడంగల్‌లో గురుపూజోత్సవంలో సీఎం రేవంత్

కొడంగల్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫొటో దిగిన ఆయన.. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పాత్రను సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల బాధ్యత ఎంతో కీలకమని అన్నారు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల పాత్రను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా చూస్తోందని పేర్కొన్నారు.

తాను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. విద్య ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా మార్చగలదో తన ప్రయాణమే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే సమయానికి తెలంగాణ దేశంలో 28వ స్థానంలో ఉండగా.. ప్రస్తుతం 17వ స్థానానికి చేరుకుందని సీఎం పేర్కొన్నారు. విద్య, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.

55 రోజుల్లోనే డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేశాం

ఉపాధ్యాయ నియామకాల విషయంలో గతంలో ఎదురైన సమస్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వాల హయాంలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షలు, నియామకాలు ఎప్పుడు పూర్తవుతాయో స్పష్టత ఉండేది కాదని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ప్రక్రియను వేగంగా పూర్తి చేశామని చెప్పారు. కేవలం 55 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేశామని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 25,950 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చినట్లు సీఎం తెలిపారు.

ఉపాధ్యాయులు తమ విధులపై పూర్తి దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి కోరారు. వచ్చే రెండేళ్లపాటు తమ సమస్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వాటి పరిష్కారానికి తాను బాధ్యత తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయని సీఎం విమర్శించారు. ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

మొత్తంగా కొడంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగానూ, విద్యా రంగంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఓటర్ల జాబితా విషయంలో కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించగా.. మరోవైపు ఉపాధ్యాయుల సమస్యలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
అనుముల రేవంత్ రెడ్డి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Revanth Reddy : రేవంత్ రెడ్డికి కేరళ అవార్డు.. ఎవరీ ఆర్యదాన్ ముహమ్మద్?
Recommended image2
Balapur Ganesh Laddu: హిస్టరీ క్రియేట్ చేసిన బాలాపూర్ లడ్డూ వేలం.. ఎవరు దక్కించుకున్నారో తెలుసా?
Recommended image3
Dasara Holidays: దసరా సెలవులు ఎప్పటినుంచో తెలుసా?
Related Stories
Recommended image1
అలా చేయకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుంటా అన్నారా.? కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved