బిజెపి దెబ్బ: హరీష్ రావును అక్కున చేర్చుకున కేసీఆర్
First Published Dec 10, 2020, 8:58 PM IST
తెలంగాణలో బిజెపి తనను ఎదుర్కోడానికి సర్వశక్తులను ఒడ్డుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్లు అర్థమవుతోంది

తెలంగాణలో బిజెపి తనను ఎదుర్కోడానికి సర్వశక్తులను ఒడ్డుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు నష్టనివారణ చర్యలకు పూనుకున్నట్లు అర్థమవుతోంది. దుబ్బాక ఉప ఎన్నిక ఓటమి హరీష్ రావు పేరు మీది నుంచి వెళ్లిపోయి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తన తనయుడు కేటీఆర్ సత్తా చాటుకుంటారని బహుశా కేసీఆర్ భావించి ఉండవచ్చు. అయితే, పరిస్థితి తిరబడుతుందనే విషయం జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా రుజువైంది.

మంత్రి, మేనల్లుడు హరీష్ రావును దూరం పెట్టడం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. బిజెపి దెబ్బతో కేసీఆర్ మనసు మారిందని అంటున్నారు. సిద్ధిపేట పర్యటనలో హరీష్ రావుకు కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యం ఆ విషయాన్ని తెలియజేస్తోంది. చాలా కాలంగా దూరం పెడుతూ వచ్చిన హరీష్ రావును ఆయన సిద్ధిపేట పర్యనటలో అక్కున చేర్చుకున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?