అష్టదిగ్భంధనంలో కేసీఆర్: మంచి తరుణం మళ్లీ దొరకునా.. బీజేపీ వ్యూహాలు
First Published Oct 11, 2019, 5:25 PM IST
కేసీఆర్‌ను సరిగ్గా లాక్ చేయడానికి తమకు ఇంతకన్నా మంచి సమయం మళ్లీ రాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితిని ఢిల్లీ స్థాయిలో నిశితంగా గమనిస్తున్నారు. ఇక సరైన సమయంలో సంధించడానికి బ్రహ్మాస్త్రం గవర్నర్ తమిళిసై ఎలాగు ఉన్నారు

తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇద్దరు ముఖ్యమంత్రులకు బాగా కావాల్సిన వ్యక్తి అయిన మేఘా కృష్ణారెడ్డి చెందిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీ యజమానుల నివాసాలతో పాటు కార్యాలయాలపై ఐటీ శాఖ పెద్ద ఎత్తున సోదాలకు దిగడం కార్పోరేట్, పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆర్టీసీ కార్మికులు తాము సమ్మె చేస్తూనే మరిన్ని వర్గాలను ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీకి తెరాస మినహా తెలంగాణలోని అన్ని రాజకీయ, ఉద్యోగ, ప్రజా సంఘాల నుంచి సంపూర్ణ మద్ధతు లభిస్తోంది. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేం లేదని కేసీఆర్ అండ్ కో భావిస్తున్నప్పటికీ ఇది రానున్న రోజుల్లో పెను సమస్యగా మారే అవకాశాలు ఉన్నట్లుగానే పరిణామాలు కనిపిస్తున్నాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?