విజయాలతో జోష్:తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ ప్లాన్
First Published Dec 11, 2020, 4:59 PM IST
తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు బీజేపీలో జోష్ ను నింపాయి. దీంతో ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ తెరతీసింది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలకు బీజేపీ గాలం వేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ నుండి సినీ నటి విజయశాంతి ఇటీవలనే బీజేపీలో చేరింది. మరికొందరు నేతలు కూడ కాంగ్రెస్ ను వీడుతారనే ప్రచారం సాగుతోంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?