తెలంగాణపై ఫోకస్: మూడు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన ,హైకమాండ్‌కు నివేదిక
మూడు రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ పరిస్థితిపై జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.
తెలంగాణపై ఫోకస్: మూడు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన ,హైకమాండ్‌కు నివేదిక
తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. మూడు రాష్ట్రాల్లోని బీజేపీ ఎమ్మెల్యేలు రేపటి నుండి వారం రోజుల పాటు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నివేదికను ఇవ్వనున్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని కమల దళం వ్యూహారచన చేస్తుంది.
తెలంగాణపై ఫోకస్: మూడు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన ,హైకమాండ్‌కు నివేదిక
ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఎమ్మెల్యేలు రేపు హైద్రాబాద్ కు రానున్నారు. హైద్రాబాద్ లోని పార్టీ కార్యాలయంలో వర్క్ షాప్ ను నిర్వహించనున్నారు. ఈ వర్క్ షాపు తర్వాత ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను కేటాయించనున్నారు. తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యేలు పర్యటించి పార్టీపై క్షేత్రస్థాయి నివేదికను జాతీయ నాయకత్వానికి అందిస్తారు.
తెలంగాణపై ఫోకస్: మూడు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన ,హైకమాండ్‌కు నివేదిక
తమకు కేటాయించిన నియోజకవర్గంలోని ఒక్కో మండలంలో ఒక్కో రోజు ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. అసెంబ్లీ స్థాయి కోర్ కమిటీ ముఖ్యులతో భేటీ అవుతారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు ఏమిటనే విషయమై చర్చించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో సోషల్ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తారు. అంతేకాదు గెలుపు ఓటములను ప్రభావితం చేసే వ్యక్తులతో డిన్నర్ సమావేశాల్లో పాల్గొంటారు.స్థానిక నేతలతో వ్యక్తిగతంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులపై చర్చిస్తారు. ప్రత్యర్థి నేతలు, పార్టీల బలబలాలు, సామాజిక సమీకరణాలు తదితర అంశాలపై చర్చిస్తారు.
తెలంగాణపై ఫోకస్: మూడు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన ,హైకమాండ్‌కు నివేదిక
మరో వైపు ఎస్సీ, ఎస్టీ కార్యకర్తల ఇళ్లలో ఎమ్మెల్యేలు భోజనం చేస్తారు. వారితో సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలతో కూడ ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాలు అమలు తీరును పరిశీలిస్తారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై క్షేత్ర స్థాయిలో ప్రజల అభిప్రాయాలను కూడ తెలుసుకుంటారు.
తెలంగాణపై ఫోకస్: మూడు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన ,హైకమాండ్‌కు నివేదిక
వారం రోజుల పాటు తాముపర్యటించిన నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.దక్షిణాదిలోని తెలంగాణపై బీజేపీ నాయకత్వం ఫోకస్ ను పెంచింది. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఈ దిశగా కమల దళం వ్యూహాలు రచిస్తుంది.
తెలంగాణపై ఫోకస్: మూడు రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేల క్షేత్రస్థాయి పర్యటన ,హైకమాండ్‌కు నివేదిక
ఇదిలా ఉంటే ఈ నెలాఖరు నుండి తెలంగాణ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుండి బస్సు యాత్రలను బీజేపీ నాయకత్వం ప్రారంభించనుంది. బాసర, ఆలంపూర్, భద్రాచలం నుండి ఈ యాత్రలను చేపట్టనుంది. సెప్టెంబర్ 17న హైద్రాబాద్ లో యాత్రలు ముగించనున్నారు.యాత్ర ముగింపును పురస్కరించుకొని భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తుంది కమల దళం.ఈ సభకు మోడీని ఆహ్వానించాలని కమలదళం ప్లాన్ చేసింది.