తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 50 మంది పేర్లు:గెలుపు గుర్రాల ఎంపికపై బీజేపీ ఫోకస్
తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు కేంద్ర మంత్రి అమిత్ షా దిశానిర్ధేశం చేశారు.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 50 మంది పేర్లు:గెలుపు గుర్రాల ఎంపికపై బీజేపీ ఫోకస్
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థులను ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తరహా జాప్యం చేయవద్దని పార్టీ నాయకత్వం భావిస్తుంది.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 50 మంది పేర్లు:గెలుపు గుర్రాల ఎంపికపై బీజేపీ ఫోకస్
బీజేపీ తెలంగాణ ఎన్నికల కోర్ కమిటీ నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా శనివారం నాడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. బీఆర్ఎస్ లోని సిట్టింగ్ ఎంపీలు ఎవరైనా బీజేపీలో చేరే అవకాశం ఉందా అనే విషయమై కూడ పార్టీ నేతలతో అమిత్ షా ఆరా తీశారని సమాచారం.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 50 మంది పేర్లు:గెలుపు గుర్రాల ఎంపికపై బీజేపీ ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని బీజేపీ వ్యూహారచన చేస్తుంది.ఈ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల నుండి ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 50 మంది పేర్లు:గెలుపు గుర్రాల ఎంపికపై బీజేపీ ఫోకస్
2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఈ నాలుగు ఎంపీలతో పాటు ఇతర స్థానాల్లో కూడ విజయం కోసం గెలుపు గుర్రాల కోసం బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 50 మంది పేర్లు:గెలుపు గుర్రాల ఎంపికపై బీజేపీ ఫోకస్
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో స్థానానికి మూడు నుండి ఐదుగురు ఆశావాహుల పేర్లను బీజేపీ నాయకత్వానికి కిషన్ రెడ్డి అందించారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల అభ్యర్థులు, ప్రత్యర్ధుల బలబలాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది బీజేపీ.17 స్థానాల్లో పోటీ చేసే 50 మంది ఆశావాహుల పేర్లను కిషన్ రెడ్డి బీజేపీ కేంద్ర నాయకత్వానికి అందించారు.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 50 మంది పేర్లు:గెలుపు గుర్రాల ఎంపికపై బీజేపీ ఫోకస్
మల్కాజిగిరి, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల నుండి పోటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్ధుల నుండి కమలం పార్టీ ధరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఈ దఫా మాత్రం ధరఖాస్తులను బీజేపీ తీసుకోలేదు.
తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 50 మంది పేర్లు:గెలుపు గుర్రాల ఎంపికపై బీజేపీ ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో రెండంకెల స్థానాల్లో ఎంపీ సీట్లను దక్కించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవాలనే ఆ పార్టీ భావిస్తుంది.