MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Hyderabad : మండు వేసవిలో మైనస్ డిగ్రీ టెంపరేచర్స్.. ఎండల్లో మీ పిల్లలు చిల్ అవ్వాలంటే బెస్ట్ స్పాట్స్ ఇవే

Hyderabad : మండు వేసవిలో మైనస్ డిగ్రీ టెంపరేచర్స్.. ఎండల్లో మీ పిల్లలు చిల్ అవ్వాలంటే బెస్ట్ స్పాట్స్ ఇవే

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లల సందడి మామూలుగా ఉండదు. కానీ భానుడి భగభగలు చూస్తుంటే బయటకు అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఈ ఎండల నుంచి తప్పించుకుంటూనే పిల్లలకు చిరస్మరణీయమైన సెలవులను అందించాలా..? అయితే ఈ స్టోరీ మీకోసమే… 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 03 2026, 02:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హైదరాబాద్ లో చల్లచల్లని ప్రాంతాలు..
Image Credit : Gemini AI

హైదరాబాద్ లో చల్లచల్లని ప్రాంతాలు..

Hyderabad Tourist Spots : ప్రస్తుతం వేసవికాలం కొనసాగుతోంది... ఇప్పటికే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇప్పుడు వర్షాల కారణంగా ఎండల తీవ్రత తక్కువగా ఉంది, కానీ రాబోయే రోజుల్లో మండిపోవడం ఖాయమంటున్నారు వాతావరణ నిపుణులు. దీంతో పిల్లల ఎగ్జామ్స్ హడావిడి ముగిశాక వారిని ఎక్కడికైనా బయటకు తీసుకెళదామనుకునే తల్లిదండ్రులను ఈ వాతావరణ సమచారం కంగారుపెడుతోంది. అయితే మండుటెండల్లో కూడా చల్లచల్లగా ఉండే టూరిస్ట్ స్పాట్స్ కొన్ని హైదరాబాద్ లో ఉన్నాయి... ఇవి పిల్లలకు ఎంతగానో నచ్చుతాయి. అలాంటి టాప్ 5 సమ్మర్ డెస్టినేషన్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. మండు వేసవిలో మైనస్ డిగ్రీల మంచు లోకం... స్నో వరల్డ్ (Snow World)
Image Credit : ANI

1. మండు వేసవిలో మైనస్ డిగ్రీల మంచు లోకం... స్నో వరల్డ్ (Snow World)

బయట ఎండ 40 డిగ్రీలు దాటినా ఇక్కడ మాత్రం చలి వణుకు పుట్టిస్తుంది. లోయర్ ట్యాంక్ బండ్‌ వద్ద ఉన్న ఈ స్నో వరల్డ్‌లో పిల్లలతో కలిసి మంచులో ఆడుకోవడం ఒక మరుపురాని అనుభవం. మంచు కొండల మీద జారడం, స్నో బాల్స్‌తో ఆడుకోవడం పిల్లలకు కొండంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎండ తాపం నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఇది నంబర్ వన్ ఛాయిస్. పిల్లలే కాదు ఇక్కడ పేరెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేయవచ్చు.

Related Articles

Related image1
Hyderabad: అప్ప‌ట్లో కూక‌ట్‌ప‌ల్లి ఇప్పుడు ఇది.. జ‌స్ట్ 5 ఏళ్ల‌లో హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Related image2
Hyderabad : ఏకంగా మాజీ సీఎం ఇంటినే సీజ్ చేసేశారా..! ఎందుకో తెలుసా..?
36
2. జలవిహార్, వండర్లా... నీటి అలల మధ్య కేరింతలు
Image Credit : Instagram (mdadil_officiall, adventureislandtampa)

2. జలవిహార్, వండర్లా... నీటి అలల మధ్య కేరింతలు

వేసవి కాలం చల్లచల్లని నీటిలో ఆడటాన్ని పిల్లలు బాగా ఇష్టపడతాయి. కాబట్టి జలవిహార్, వండర్ లా వంటి వాటర్ గేమ్స్ కలిగిన ప్రాంతాలకు పిల్లలకు తీసుకెళ్లవచ్చు సిటీ నడిబొడ్డున హుస్సెన్ సాగర్ తీరంలో జలవిహార్ (Jalavihar) ఉంది. నెక్లెస్ రోడ్‌లో అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ వాటర్ పార్క్ . ఇక్కడి వేవ్ పూల్, రెయిన్ డ్యాన్స్ పిల్లలకు బాగా నచ్చుతాయి.

సిటీకి కాస్త దూరం వెళ్లగలిగేవారికి వండర్లా (Wonderla) పర్పెక్ట్ ప్లేస్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఉండే రైడ్స్ ఇక్కడ సొంతం. పిల్లల కోసం ప్రత్యేకమైన వాటర్ జోన్లు ఇక్కడ ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.

46
3. కిడ్జానియా (KidZania)
Image Credit : Getty

3. కిడ్జానియా (KidZania)

గచ్చిబౌలిలోని ఈ ఇండోర్ థీమ్ పార్క్ పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది. ఇది పూర్తిగా ఏసీ సౌకర్యం ఉన్న ప్రదేశం కాబట్టి ఎండ బెడద ఉండదు. ఇక్కడ పిల్లలు డాక్టర్లుగా, పైలట్లుగా, ఫైర్ ఫైటర్లుగా మారి తమకు నచ్చిన వృత్తులను సరదాగా ప్రాక్టీస్ చేయవచ్చు. రోజంతా ఇక్కడే గడిపేసినా పిల్లలకు బోర్ కొట్టదు.

56
 4. బిర్లా ప్లానిటోరియం: నక్షత్రాల లోకానికి ప్రయాణం
Image Credit : Gemini AI

4. బిర్లా ప్లానిటోరియం: నక్షత్రాల లోకానికి ప్రయాణం

పిల్లల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచడానికి బిర్లా ప్లానిటోరియం ఉత్తమ ప్రదేశం. చల్లని ఏసీ గదిలో కూర్చుని, ఆకాశంలోని నక్షత్రాలు, గ్రహాల గురించి తెలుసుకోవడం ఒక అద్భుతమైన ఫీలింగ్. పక్కనే ఉన్న సైన్స్ మ్యూజియంలోని డైనోసార్ అస్థిపంజరం పిల్లలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

66
తల్లిదండ్రుల కోసం సూచనలు
Image Credit : Getty

తల్లిదండ్రుల కోసం సూచనలు

పగటిపూట ఎండలో తిరగడం ఇబ్బంది అనుకుంటే సాయంత్రం వేళ ఈ ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ : ఇక్కడ లైటింగ్, పక్కనే ఉన్న పార్క్ పిల్లలకు నచ్చుతాయి.

లుంబినీ పార్క్: హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ చేస్తూ బుద్ధ విగ్రహాన్ని చూడటం, సాయంత్రం వేళ లేజర్ షో వీక్షించడం ఒక మంచి ఫ్యామిలీ అవుటింగ్.

తల్లిదండ్రుల కోసం సూచనలు

సమయపాలన : ఉదయం 11 నుండి సాయంత్రం 4 వరకు సాధ్యమైనంత వరకు ఇండోర్ (ఏసీ) ప్రదేశాలకే పరిమితం అవ్వండి.

ఆహారం : పిల్లలకు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, సరిపడా మంచినీరు అందిస్తూ ఉండండి.

దుస్తులు : తేలికపాటి కాటన్ దుస్తులు ధరిస్తే ప్రయాణం హాయిగా సాగుతుంది.

ఈ వేసవిలో ఇంట్లోనే ఉండి బోర్ కొట్టకుండా, మీ పిల్లలను ఈ ప్రాంతాలకు తీసుకెళ్లి వారి ముఖాల్లో చిరునవ్వులు చూడండి!

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఓవ‌ర్ టూ ఢిల్లీ.. హ‌స్తినాలో హీటెక్కుతోన్న తెలంగాణ రాజ‌కీయం. అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image3
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Related Stories
Recommended image1
Hyderabad: అప్ప‌ట్లో కూక‌ట్‌ప‌ల్లి ఇప్పుడు ఇది.. జ‌స్ట్ 5 ఏళ్ల‌లో హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Recommended image2
Hyderabad : ఏకంగా మాజీ సీఎం ఇంటినే సీజ్ చేసేశారా..! ఎందుకో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved