MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Beer: మొన్న చేప పిల్ల, నేడు కండోమ్ ప్యాకెట్.. బీర్ బాటిళ్లలోకి ఇవి ఎలా వస్తున్నాయబ్బా.?

Beer: మొన్న చేప పిల్ల, నేడు కండోమ్ ప్యాకెట్.. బీర్ బాటిళ్లలోకి ఇవి ఎలా వస్తున్నాయబ్బా.?

Beer: ఇటీవల బీర్ బాటిళ్లకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో బీర్ బాటిల్‌లో చేపపిల్ల కనిపించిందని ప్రచారం జరగగా, మరో ఘటనలో సీల్ చేసిన బీర్ బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్ ఉన్నట్లు వార్త‌లు వచ్చాయి.  

2 Min read
Author : Narender Vaitla
| Updated : May 22 2026, 03:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బీర్ బాటిల్లో చేప‌పిల్ల
Image Credit : Telugu Scribe/X

బీర్ బాటిల్లో చేప‌పిల్ల

గ‌త కొన్ని రోజుల క్రితం హైద‌రాబాద్‌లోని నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్లోని ఓ వైన్స్ షాపులో బీర్ బాటిల్లో చేప‌పిల్ల ఈదుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో బీర్ బాటిల్‌లో చేపపిల్ల ఈదుతున్నట్లు క‌నిపించింది. దీంతో అప్ప‌ట్లో ఇది పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన యునైటెడ్ బ్రూవరీస్, ఆ వీడియోలోని సమాచారం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో, తమ తయారీ యూనిట్లలో కఠిన నాణ్యతా ప్రమాణాలు అమల్లో ఉన్నాయని తెలిపింది. పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థలో, నియంత్రిత వాతావరణంలో బాట్లింగ్ ప్రక్రియ జరుగుతుందని వివరించింది. ఈ కారణంగా తయారీ దశలో బాటిల్‌లో చేపపిల్ల వంటి జీవులు చేరడం అసాధ్యమని స్పష్టం చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
సిద్ధిపేటలో కలకలం రేపిన కండోమ్ ప్యాకెట్ ఘటన
Image Credit : Telugu Scribe/X

సిద్ధిపేటలో కలకలం రేపిన కండోమ్ ప్యాకెట్ ఘటన

ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో వెలుగుచూసిన మరో ఘటన మరింత చర్చనీయాంశమైంది. అక్బర్‌పేట భూంపల్లిలోని ఒక వైన్ షాప్ నుంచి కొనుగోలు చేసిన లైట్ బీర్ బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్ కనిపించిందని ఓ వినియోగదారుడు ఆరోపించాడు. సీల్ తీయని బాటిల్‌లో ఈ వస్తువు కనిపించడంతో అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. అనంతరం వైన్ షాప్ సిబ్బందిని ప్రశ్నించగా సరైన స్పందన లభించలేదని ఆరోపిస్తూ ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related Articles

Related image1
Railways Rules: రైలు దిగిన తర్వాత స్టేషన్‌లో ఎంతసేపు ఉండొచ్చు? చాలా మందికి తెలియని రూల్స్ ఇవే
Related image2
పాత బ‌ట్ట‌లను ఏం చేయాలో అర్థంకావ‌డం లేదా.? ఇలా చేస్తే ఇంటి అందం మార‌డం ఖాయం
35
బీర్ బాటిళ్లలో ఇలాంటి వస్తువులు ఎందుకు క‌నిపిస్తున్నాయి.?
Image Credit : twitter

బీర్ బాటిళ్లలో ఇలాంటి వస్తువులు ఎందుకు క‌నిపిస్తున్నాయి.?

బీర్ బాటిళ్లలో పురుగులు, బొద్దింకలు, బల్లులు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపించాయనే ఫిర్యాదులు గతంలో కూడా కొన్ని సందర్భాల్లో నమోదయ్యాయి. అయితే ప్రతి ఘటన వెనుక ఒకే కారణం ఉంటుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. తయారీ ప్రక్రియలో సాంకేతిక లోపాలు, నిల్వ సమయంలో జరిగిన సమస్యలు, సరఫరా గొలుసులో జరిగిన జోక్యం లేదా బాటిల్ సీలింగ్‌కు ముందు లేదా తర్వాత జరిగిన మానవ తప్పిదాలు వంటి అనేక కోణాల్లో దర్యాప్తు జరపాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన వీడియోలు లేదా చిత్రాల ప్రామాణికత కూడా విచారణ ద్వారా మాత్రమే నిర్ధారించాల్సి ఉంటుంది. అందువల్ల ఏ ఘటన జరిగినా సంబంధిత అధికారులు, తయారీ సంస్థలు సాంకేతిక పరిశీలన అనంతరం మాత్రమే అసలు కారణాలను వెల్లడిస్తుంటాయి.

45
యునైటెడ్ బ్రూవరీస్ ఏమి చెప్పింది?
Image Credit : google

యునైటెడ్ బ్రూవరీస్ ఏమి చెప్పింది?

సిద్ధిపేట ఘటనపై కూడా యునైటెడ్ బ్రూవరీస్ స్పందించింది. వినియోగదారుడి ఫిర్యాదు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి అంశాలను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తామని పేర్కొంది. తమ సంస్థ ప్రపంచ స్థాయి నాణ్యత, భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తోందని వెల్లడించింది. ఉత్పత్తి ప్రక్రియ మొత్తం నియంత్రిత వాతావరణంలో జరుగుతుందని, ప్రతి దశలో నాణ్యతా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపింది. ఇలాంటి కఠిన ప్రమాణాల నేపథ్యంలో బాటిల్‌లో అనుమానాస్పద వస్తువు ఉండటం అసాధ్యమని సంస్థ అభిప్రాయపడింది.

బీర్ బాటిల్లో కండోమ్ ప్యాకెట్ కలకలం

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లిలోని ఓ వైన్స్ షాపులో తాను కొన్న కింగ్ ఫిషర్ బీర్ బాటిల్లో ఖాళీ కండోమ్ ప్యాకెట్ చూసి ఆశ్చర్య పోయిన వ్యక్తి

ఇదేంటని నిలదీయగా వైన్స్ షాప్ నిర్వాహకులు స్పందించలేదని షాప్ ముందు ఆందోళనకు దిగిన వినియోగదారులు… pic.twitter.com/dsYtybPXWv

— Telugu Scribe (@TeluguScribe) May 20, 2026

55
విచారణ కొనసాగుతోంది..
Image Credit : stockPhoto

విచారణ కొనసాగుతోంది..

ఈ ఘటనలపై సంబంధిత అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. బాటిల్‌లో కనిపించిన వస్తువులు తయారీ సమయంలో చేరాయా? లేక ఇతర కారణాల వల్ల ఆ పరిస్థితి ఏర్పడిందా? అనే అంశాలపై పరిశీలన జరుగుతోంది. ఇక యునైటెడ్ బ్రూవరీస్ కూడా అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad : రూ.1.45 లక్షల కోట్ల బిగ్ ప్రాజెక్టు.. ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్లాక్‌బస్టర్.. లోకల్ యువతకు పండగే
Recommended image2
RRR: ఆర్ఆర్ఆర్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఇక ఆ ప్రాంతాలన్నీ సిటీలు కాబోతున్నాయి !
Recommended image3
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ !
Related Stories
Recommended image1
Railways Rules: రైలు దిగిన తర్వాత స్టేషన్‌లో ఎంతసేపు ఉండొచ్చు? చాలా మందికి తెలియని రూల్స్ ఇవే
Recommended image2
పాత బ‌ట్ట‌లను ఏం చేయాలో అర్థంకావ‌డం లేదా.? ఇలా చేస్తే ఇంటి అందం మార‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved