షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ లీక్.. ఇంటర్నెట్ లో వైరల్.. త్వరలోనే లాంచ్ ?
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి ఒక కొత్త మిడ్-రేంజ్ ఫోన్ తీసుకోస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. రెడ్‌మి కె 40 సిరీస్ మోడల్ లేదా ఎంఐ 11 వేరియంట్‌గా ఉంటుందని ఊహిస్తున్నారు.
హోల్-పంచ్ డిజైన్‌తో ఓఎల్‌ఈడి డిస్ ప్లే రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ పేరుపై స్పష్టత లేదు, కానీ స్పెసిఫికేషన్ల ప్రకారం ఎంఐ 11 సిరీస్ ఫోన్ లేదా రెడ్‌మి కె 40 సిరీస్ హ్యాండ్‌సెట్ కావచ్చు. రెడ్‌మి కె40 ఈ నెలలో ఎప్పుడైనా కావొచ్చని, వనిల్లా మోడల్ క్వాల్‌కామ్ నుండి సబ్-ఫ్లాగ్‌షిప్ ఎస్‌ఓసి ఉంటుందని భావిస్తున్నారు.
సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌తో ఓఎల్‌ఈడి డిస్ ప్లే ఉండే అవకాశం ఉన్నట్లు ఒక వార్తా లీక్ అయింది. 5x జూమ్ సపోర్ట్ తో 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కెమెరా ఉండవచ్చని మరో వెబ్ సైట్ పేర్కొంది. కాని పూర్తి వివరాలు లీక్ కాలేదు.
దీని ధర సిఎన్‌వై 2,999 (ఇండియాలో సుమారు రూ .34,000) నుండి ప్రారంభమవుతుంది. అయితే రెడ్‌మి కె 40 ప్రో స్నాప్‌డ్రాగన్ 888 SoC చేత శక్తినిస్తుంది. గతేడాది లాంచ్ అయిన క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 765జీకి తర్వాత వెర్షన్‌గా స్నాప్ డ్రాగన్ 775జీ రానుంది. ఈ ప్రాసెసర్ ను ఇందులో తీసుకురానున్నట్లు అంచనా.
ఇది ఎంఐ 11 సిరీస్ మిడ్-రేంజ్ ఎంఐ 11 లైట్ మోడల్ కావచ్చు. ఈ లీకైన హ్యాండ్‌సెట్ పూర్తిగా భిన్నమైన మార్కెటింగ్ పేరుతో ప్రారంభింవచ్చు.