MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • వాట్సాప్ అప్‌డేట్: వెబ్ వెర్షన్‌లో మరో గొప్ప ఫోటో ఎడిటింగ్ టూల్.. ఎలా ఉపయోగించాలంటే..?

వాట్సాప్ అప్‌డేట్: వెబ్ వెర్షన్‌లో మరో గొప్ప ఫోటో ఎడిటింగ్ టూల్.. ఎలా ఉపయోగించాలంటే..?

ఫేస్ బుక్ యజమాన్యంలోని ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్ వాట్సాప్ యాప్  లో కాదు వాట్సాప్ వెబ్ వెర్షన్ లో ఉందని  మీరు తెలుసుకోవాలి.

1 Min read
Author : Ashok Kumar
Published : Aug 13 2021, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఫోటో ఎడిటింగ్ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది, అంటే మీరు మీ ల్యాప్‌టాప్ నుండి ఫోటోను వాట్సాప్‌లో పంపే ముందు దాన్ని ఎడిట్ చేయవచ్చు. ప్రస్తుతం, ఈ అప్‌డేట్ కొంతమంది యూజర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరికి అందుబాటులోకి  తీసుకురానుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 వాట్సాప్  ఈ ఫీచర్ కొన్ని రోజుల క్రితం బీటా వెర్షన్‌లో కనిపించింది. వాట్సాప్ వెబ్  కొత్త అప్‌డేట్‌ ద్వారా వినియోగదారులు ఫోటోను ఎడిట్ చేసే ఆప్షన్ పొందుతారు. అలాగే స్టిక్కర్‌లను కూడా జోడించే ఆప్షన్ కూడా ఉంది. ఫోటోలను పంపడానికి ముందు ఇప్పుడు మీరు ఎడిట్ చేయవచ్చు, స్టిక్కర్‌లను జోడించవచ్చు, కామెంట్ టైప్ చేయవచ్చు ఇంకా ఎమోజీని జోడించవచ్చు. ఒక విధంగా మొబైల్ యాప్‌ ఎడిటింగ్ తో సమానంగా ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మొబైల్ యాప్‌లోని ఫోటో ఎడిటింగ్ టూల్‌లో ఎమోజిని జోడించే ఆప్షన్ అందుబాటులో లేదు, వెబ్ వెర్షన్‌లో మాత్రం  ఈ ఫీచర్ ఉంది.

35

వాట్సాప్  ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి మీరు ముందుగా  ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకోవాలి  ఆ తర్వాత మీరు ఎడిటింగ్ టూల్స్ చూస్తారు. మీరు కింద చూపించే స్క్రీన్ షాట్ ద్వారా ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో  చూడవచ్చు.

45

గమనించదగ్గ విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం వ్యూ వన్స్ ఫీచర్‌కి ఒక అప్‌డేట్‌ను విడుదల చేసింది. వాట్సప్‌లో ఒకసారి వ్యూ వన్స్  ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత మీరు మెసేజ్ చూసిన తర్వాత ఆ మెసేజ్ అదృశ్యమవుతుంది. వాట్సాప్  వ్యూ వన్స్  ఫీచర్‌ను ఫోటోలు, వీడియోలు, మెసేజులలో ఉపయోగించవచ్చు.
 

55

వాట్సాప్ వ్యూ వన్స్ ఫీచర్ ప్రస్తుతం ఐఫోన్ వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో వాట్సాప్  కొత్త వెర్షన్ విడుదల చేయబడింది, దీనిని మీరు యాపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Festive Sale: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు
Recommended image2
Amazon vs Flipkart Sale: పండుగ సేల్ రచ్చ షురూ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సీక్రెట్ బ్యాంక్ ఆఫర్లు ఇవే !
Recommended image3
Cheapest Recharge Plan : కేవలం రూ.123 రీఛార్జ్ తొ 28 రోజుల వాలిడిటీ.. రోజూ 500MB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved