వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్: ఇప్పుడు మెసేజ్ పంపేటప్పుడు టైపింగ్ అని కనిపించదు.. ఎలా అంటే ?
నేడు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లకు పైగా వినియోగదారులు వాట్సాప్(whatsapp)ని ఉపయోగిస్తున్నారు. ఈ యాప్ మెసేజింగ్‌కు కొత్త రూపాన్ని ఇచ్చింది. ఈ కారణంగా చాలా మంది వినియోగదారులు ఇన్స్టంట్ మెసేజ్స్ పంపడానికి ఇతర యాప్‌ల కంటే ఎక్కువగా వాట్సాప్‌నే ఉపయోగిస్తున్నారు.
తరచుగా మనం స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చాట్ చేసినప్పుడల్ల వ్యక్తి ప్రొఫైల్ కింద టైపింగ్ అని చూపిస్తుంది. అయితే వాట్సాప్ ఈ గొప్ప ట్రిక్ తో మెసేజ్ పంపేటప్పుడు లేదా రిప్లయ్ ఇచ్చేటప్పుడు టైపింగ్ అని చూపించదు. వాట్సాప్‌లో అలాంటి ఫీచర్ ఇన్‌బిల్ట్ లేనప్పటికీ దీని కోసం మీరు ఒక ట్రిక్ అనుసరించాలి, అప్పుడు మాత్రమే మెసేజ్ పంపేటప్పుడు మీ టైపింగ్ స్టేటస్ కనిపించదు. ఈ స్టెప్స్ గురించి ఎంటో తెలుసుకుందాం వీటిని అనుసరించిన తర్వాత మీ టైపింగ్ స్టేటస్ సంబంధిత వ్యక్తికి కనిపించదు.
ఇందుకోసం ముందుగా వాట్సాప్ అక్కౌంట్ ఓపెన్ చెయ్యాలి
ఆ తర్వాత మీరు ఎవరికి మెసేజ్ పంపాలనుకుంటున్నారో వారి ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
ఇప్పుడు మీరు మెసేజ్ పంపే ముందు మీ మొబైల్ డేటాను ఆఫ్ చేసి, ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయాలి.
ఈ ప్రక్రియ తర్వాత కింద మెసేజ్ బాక్స్ లో మీ మెసేజ్ టైప్ చేసి పంపండి.
అయితే, డేటా ఆఫ్ అండ్ ఫ్లైట్ మోడ్ ఆన్‌లో ఉంటే మీ మెసేజ్ సెండ్ అవ్వదు
మెసేజ్ పక్కన మీరు టైమ్ ఆప్షన్ చూస్తారు.
ఇప్పుడు మీరు మీ ఫ్లైట్ మోడ్ అండ్ మొబైల్ డేటాను తిరిగి ఆన్ చేయాలి.
మీరు మొబైల్ డేటాను ఆన్ చేసిన వెంటనే మీ మెసేజ్ సంబంధిత వారికి చేరుతుంది.
ఈ సమయంలో మీ టైపింగ్ స్టేటస్ ఇతరులకు చూపించదు.