WhatsApp new feature:వాట్సాప్ లాగిన్ కోసం డబుల్ వెరిఫికేషన్.. మెసేజెస్ కోసం అన్‌డూ ఆప్షన్ కూడా
ఇన్స్టంట్ మెసేజింగ్ కోసం WhatsAppని ఎక్కువగా ఉపయోగీస్తుంటారు, అయితే ఈ యాప్ ని మరింత యూజర్ ఫ్రీఎండ్లీగా చేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నారు. ఇందులో టెక్స్ట్ కాకుండా ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, లొకేషన్లు షేర్ చేయవచ్చు. ఇంకా మీకు తెలిసిన వారికి డబ్బు కూడా పంపవచ్చు.
వాట్సాప్ ఇప్పుడు లాగిన్ ప్రక్రియను మరింత సురక్షితంగా చేసేందుకు కృషి చేస్తోంది. నివేదికల ప్రకారం, ఆకౌంట్లోకి లాగిన్ చేసేటప్పుడు అదనపు భద్రతపై WhatsApp పని చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ అండ్ iOS వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో తెలుసుకోండి...
వాట్సాప్ ట్రాకర్ WABetaInfo నివేదికలో ఇప్పుడు యూజర్ అక్కౌంట్ కి లాగిన్ చేయడానికి డబుల్ వెర్ఫికేషన్ కోడ్‌ను పొందుతారని తెలిపింది. ఈ WhatsApp ఫీచర్ బీటా టెస్టర్‌లకు విడుదల చేసినప్పుడు, మరొక డివైజ్ నుండి WhatsApp ఖాతాకు లాగిన్ చేయడానికి అదనపు వెరిఫికేషన్ కోడ్ అవసరం ఉంటుంది.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆటోమేటిక్ కోడ్
WhatsApp ఖాతాతో సహా వ్యక్తిగత వివరాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి డబుల్ వెరిఫికేషన్ కోడ్‌తో లాగిన్ ప్రక్రియను బలోపేతం చేయాలనుకుంటోంది వాట్సప్. మీరు కొత్త ఫోన్ నుండి WhatsAppకి లాగిన్ చేసినప్పుడు చాట్‌లను లోడ్ చేయడానికి ఇంకా బ్యాకప్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల ఆటోమేటిక్ కోడ్ పంపుతుంది.
సెకండ్ లాగిన్ అలెర్ట్
నివేదిక ప్రకారం, 'వాట్సాప్ ఖాతాలోకి లాగిన్ చేయడానికి మొదట సక్సెస్ అయినప్పుడు, ప్రాసెస్ పూర్తి చేయడానికి మరో 6-అంకెల కోడ్ అవసరం ఉంటుంది. అలాగే అక్కౌంట్ కి లాగిన్ చేసే ప్రయత్నం గురించి ఫోన్ నంబర్ యజమానిని హెచ్చరించడానికి మరొక మెసేజ్ కూడా పంపుతుంది. ఇతరులు లేదా ఎవరైనా వారి ఖాతాలోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాట్సాప్ నుండి వినియోగదారుకు మెసేజ్ ద్వారా తెలుస్తుంది.
డబుల్ వెరిఫికేషన్ లాగిన్‌తో మొదటి మెసేజింగ్ యాప్
ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. దీనిని ప్రవేశపెడితే డబుల్ వెరిఫికేషన్ లాగిన్ ప్రాసెస్ ఉపయోగించే మొదటి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ WhatsApp అవుతుంది.
Undo ఆప్షన్
WABetaInfo నివేదిక ప్రకారం, WhatsApp వినియోగదారుల కోసం Undo ఆప్షన్ కూడా తీసుకువస్తోంది. అంటే పొరపాటున పంపిన మెసేజెస్ తొలగించే అవకాశాన్ని వినియోగదారులకు ఇస్తుంది. త్వరలో WhatsAppలో Undo బటన్ స్క్రీన్ కింద భాగంలో పాపప్ అవుతుంది. రిపోర్ట్ ప్రకారం, ఒక యూజర్ డిలీట్ ఫర్ మి ఆప్షన్‌ను ట్యాప్ చేసినప్పుడు, వాట్సాప్ కింద అన్‌డూ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ Gmailలో పని చేసే విధంగానే ఉంటుంది.