- Home
- Technology
- VERIT App: ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. మీరు తాగుతోన్న మందు కల్తీదా, మంచిదా తెలిసిపోతుంది
VERIT App: ఫోన్‌లో ఈ యాప్ ఉంటే చాలు.. మీరు తాగుతోన్న మందు కల్తీదా, మంచిదా తెలిసిపోతుంది
VERIT App: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బీసీఎల్ (BCL) డిపోల ద్వారా సరఫరా అయ్యే ఆల్కహాల్ బాటిళ్ల నాణ్యతను యూజర్లు సులభంగా గుర్తించేందుకు VERIT మొబైల్ యాప్‌ను రూపొందించారు. ఇంతకీ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

VERIT యాప్ ఎలా పనిచేస్తుంది?
వినియోగదారులు ముందుగా తమ స్మార్ట్‌ఫోన్‌లో VERIT యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంతరం లైసెన్స్ పొందిన ఆల్కహాల్ దుకాణం నుంచి కొనుగోలు చేసిన బాటిల్‌పై ఉన్న 2డీ హోలోగ్రామ్‌ను యాప్‌తో స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన సమాచారం సురక్షితంగా సర్వర్‌కు చేరుతుంది. ఆ తర్వాత సర్వర్ నుంచి వచ్చిన సమాచారాన్ని యాప్ విశ్లేషించి, ఆ బాటిల్ అసలైనదా లేదా అనే వివరాలను వెంటనే స్క్రీన్‌పై చూపిస్తుంది.
యాప్ వల్ల వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు
VERIT యాప్ ప్రధాన ఉద్దేశం నకిలీ ఆల్కహాల్ విక్రయాలను అరికట్టడం. ఈ యాప్ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేస్తున్న బాటిల్ అసలైనదేనా అని ధృవీకరించుకోవచ్చు. ఈ యాప్ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు. నకిలీ ఆల్కహాల్ నుంచి వినియోగదారులు రక్షణ పొందొచ్చు. లైసెన్స్ పొందిన దుకాణాల్లో పారదర్శక విక్రయ వ్యవస్థకు ప్రోత్సాహం. మందు కొనుగోలులో వినియోగదారుల విశ్వాసం పెరగడం. అసలైన ఉత్పత్తిని సులభంగా గుర్తించే అవకాశం.
యాప్ తాజా వెర్షన్.. ఇతర వివరాలు
VERIT యాప్ ప్రస్తుతం 1.4.0 వెర్షన్లో అందుబాటులో ఉంది. ఈ వెర్షన్‌ను 2026 జూన్ 10న అప్‌డేట్ చేశారు. యాప్‌ను ఇప్పటివరకు లక్ష మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్‌ను 2017 జనవరి 2న విడుదల చేశారు. దీనిని C-Tel Infosystem Pvt. Ltd. సంస్థ అభివృద్ధి చేసింది. చిన్నారులకు కూడా అనుకూలంగా ఉండేలా 3+ రేటింగ్‌తో గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది.
డేటా సెక్యూరిటీ
యాప్ డెవలపర్ ఇచ్చిన సమాచారం ప్రకారం, వినియోగదారుల సమాచారాన్ని ఇతర సంస్థలు లేదా మూడో వ్యక్తులతో పంచుకోరు. అయితే యాప్ కొన్ని వివరాలను సేకరించే అవకాశం ఉంది. వాటిలో ఫోన్ నంబర్, లొకేషన్ సమాచారం.
యూజర్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
VERIT యాప్ ఆల్కహాల్ బాటిల్ అసలుదనాన్ని గుర్తించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమే. బాటిల్ అసలైనదో కాదో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఆల్కహాల్ ధర నిర్ణయించడం లేదా MRP మార్చడం కోసం ఈ యాప్‌ను ఉపయోగించరాదు. ఆల్కహాల్ కొనుగోలు చేసే సమయంలో బాటిల్‌పై ముద్రించిన వివరాలు, హోలోగ్రామ్, బిల్ వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిశీలించడం ద్వారా మోసాలకు గురికాకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదనే విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

