రూ.100లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. ఇంటర్నెట్ స్పీడ్ కూడా..
దేశంలోనే అతిపెద్ద టెలికాం కంపెనీగా రిలయన్స జియో అవతరించింది. జియో డేటా టాప్-అప్ ప్లన్స్ రూ.19తో ప్రారంభమవుతుంది. Jio టాప్-అప్ రీఛార్జ్ ప్లాన్ కూడా రూ.61కి అందుబాటులో ఉంది, ఈ ప్లాన్ 6GB డేటాతో వస్తుంది.
కస్టమర్ అదనపు డేటా కోసం రీఛార్జ్ చేయాలనుకుంటే, ఈ ప్లాన్స్ లో దేనినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు . జియో డేటా ప్లాన్‌లు రూ.15, రూ.19, రూ.25, రూ.29 అండ్ రూ.61.
రూ.15 రీఛార్జ్ ప్లాన్
Jio రూ. 15 డేటా వోచర్ ప్లాన్ మీకు 1GB అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ చెల్లుబాటు మీ ప్రస్తుత ప్లాన్ తో ఉంటుంది. మీ డైలీ డేటా అయిపోయిన తర్వాత మీరు 1GB అదనపు డేటా కోసం ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ.19 రీఛార్జ్ ప్లాన్
Jio మరో బూస్టర్ డేటా ప్లాన్‌ను కూడా ప్రారంభించింది, దీని ధర కేవలం రూ.19 మాత్రమే. ఇందులో, సాధారణ డేటా కాకుండా, మీకు 1.5GB అదనపు డేటా ఇవ్వబడుతుంది, ఈ ప్లాన్ మీ డేటా పరిమితి ముగిసిన తర్వాత మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇందులో మీరు కాల్స్ అండ్ SMS వంటి ఎటువంటి ప్రయోజనం పొందలేరు.
రూ.25 రీఛార్జ్ ప్లాన్
రిలయన్స్ జియో వినియోగదారులకు రూ.25 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. దీనితో డైలీ డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 2GB వరకు అదనపు డేటాను పొందుతారు. మీరు మీ ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్ వాలిడిటీ వ్యవధిలోపు ఈ రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్ పొందవచ్చు.
రూ. 29 రీఛార్జ్ ప్లాన్
ఇవి కాకుండా, మీరు మీ డైలీ డేటా పరిమితిని చేరుకున్న తర్వాత Jio మీకు రూ.29 రీఛార్జ్ ప్లాన్‌ను కూడా అందిస్తుంది. ఇందులో, Jio మీకు 2.5GB అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ మీకు ఏ ఇతర ప్రయోజనాన్ని ఇవ్వదు కానీ మీరు ఇప్పటికే ఉన్న ప్లాన్ వాలిడిటీ వరకు దీనిని ఉపయోగించవచ్చు.
రూ.61 రీఛార్జ్
కొన్ని ముఖ్యమైన పని కోసం మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ కావాలంటే, మీరు రూ.61 డేటా బూస్టర్ ప్లాన్‌ని తీసుకోవచ్చు. మీరు 6 GB వరకు డేటాను పొందే అనేక బెనిఫిట్స్ పొందుతారు, ఈ ప్లాన్ వాలిడిటీలో ఉన్నంత వరకు మీరు ఉపయోగించవచ్చు.