నోకియా కాదు, స్యంసంగ్ కాదు; ఇండియాలో ఉపయోగించిన మొట్టమొదటి మొబైల్ ఎదో తెలుసా..
మీరు భారతదేశంలో ఉపయోగించిన మొదటి మొబైల్ గురించి ఆలోచిస్తే, చాలా మంది నోకియా లేదా శాంసంగ్ అని చెబుతారు. అయితే, ఈ రెండూ కూడా ఇండియాలో ప్రవేశపెట్టిన మొదటి మొబైల్ ఫోన్స్ కాదు. ప్రస్తుతం ఐఫోన్ ఇంకా ఎన్నో రకాల ఆండ్రాయిడ్ ఫోన్‌లు దేశంలో అందుబాటులో ఉన్నాయి. కానీ కొందరు వారికీ బెస్ట్ అనిపించే కొన్ని బ్రాండ్‌లను మాత్రమే ఉపయోగిస్తారు.
కొందరు ఐఫోన్ ప్రియులు అయితే, మరికొందరు Samsung, Vivo మొదలైన బ్రాండ్‌లను ఇష్టపడుతుంటారు. అయితే ఇండియాలో తొలిసారిగా ఏ మొబైల్ ఉపయోగించారో తెలుసా? మీరు భారతదేశంలో ఉపయోగించిన మొదటి మొబైల్ గురించి ఆలోచనవస్తే చాలా మంది నోకియా లేదా శాంసంగ్ అని చెబుతారు. ఎందుకంటే మొబైల్ ఫోన్ల వాడకం మొదలైన రోజుల్లో అందరి చేతుల్లో నోకియా ఎక్కువగా కనిపించేది. మరికొంత మంది ప్రజలు శాంసంగ్‌ను వాడేవారు.
కానీ, భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి మొబైల్ ఫోన్ నోకియా ఇంకా శాంసంగ్ కూడా కాదని మీకు తెలుసా? దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి...
motoమోటరోలా భారతీయ మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించిన మొదటి బ్రాండ్. ఈ బ్రాండ్ భారతదేశంలో మొదటిసారిగా చిన్న బేసిక్ మొబైల్‌ను విడుదల చేసింది. ఈ చిన్న మొబైల్ ఫోన్ పేరు DYNTAC 8000X. ఆ తర్వాత నోకియా, శాంసంగ్ మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి.
మోటరోలా భారతీయ మార్కెట్‌కు మొబైల్ ఫోన్‌లను పరిచయం చేసిన కంపెనీ. దీని ఐకానిక్ మోడల్ DYNTAC 8000X నాలుగు దశాబ్దాల క్రితం భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఇటుక లాంటి మొబైల్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో పురోగతిని సూచిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు చాలా త్వరగా ఛార్జ్ అవుతాయి. కానీ DYNTAC 8000X ఛార్జ్ చేయడానికి సుమారు 10 గంటలు పట్టేది. పూర్తిగా ఛార్జ్ చేసినప్పటికీ, ఈ మొబైల్‌ని కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉపయోగించవచ్చు. దీని బరువు సుమారు 1 కిలో ఉంటుంది.
DYNTAC 8000X దాని అపారమైన బరువు కారణంగా ఎక్కువ పాపులారిటీ చెందలేదు. ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లడం కష్టంగా ఉండడంతో ప్రజలు దీనికి దూరమయ్యారు. దీని ధర మూడు లక్షల రూపాయలు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ ధర ప్రస్తుత iPhone 15 Pro Max ధర కంటే డబుల్. iPhone 15 Pro Max ప్రస్తుత ధర సుమారు 1.5 లక్షల రూపాయలు. మోటరోలా తర్వాత చాలా తక్కువ బరువు, ఫీచర్ ప్యాక్డ్ మొబైల్ ఫోన్‌లు భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడ్డాయి.