48 మెగాపిక్సెల్ కెమెరా, ఏ‌ఐ సపోర్ట్ తో టెక్నో స్మార్ట్ ఫోన్ లాంచ్.. అమెజాన్ ద్వారా ఫస్ట్ సేల్..

First Published May 24, 2021, 11:45 AM IST

 టెక్నో మొబైల్ ఇండియా గత నెలలో ప్రపంచవ్యాప్తంగా  స్పార్క్ 7 సిరీస్ కింద టెక్నో స్పార్క్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను  విడుదల చేసింది. దీనికి ముందు ఈ సిరీస్ కింద స్పార్క్ 7, స్పార్క్ 7 పిలను లాంచ్ చేసింది. కంపెనీ ఇప్పుడు ఈ సిరీస్ నుండి  నాల్గవ ఫోన్‌ టెక్నో స్పార్క్ 7 ప్రోను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది.