- Home
- Technology
- మీ నార్మల్ ఫొటోను డ్రోన్ షాట్‌గా మార్చుకోవచ్చు.. చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
మీ నార్మల్ ఫొటోను డ్రోన్ షాట్‌గా మార్చుకోవచ్చు.. చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
Tech News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అసాధ్యమనేది లేకుండా పోయింది. ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు ఫొటోలను నచ్చిన విధంగా మార్చుకునే అవకాశం లభించింది. అలాంటి ఒక ప్రాంప్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డ్రోన్ షాట్
పెళ్లిళ్లు, సినిమా ఈవెంట్స్‌లో డ్రోన్ కెమెరాల వినియోగం భారీగా పెరిగింది. అయితే ఒకప్పుడు కేవలం వీటికే పరిమితమైన డ్రోన్స్‌ను సాధారణ ప్రజలు కూడా ఉపయోగించే పరిస్థితి వచ్చింది. డ్రోన్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే ఎంత కాదన్నా డ్రోన్ కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. అయితే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొబైల్‌తోనే డ్రోన్ షాట్ తీసుకుంటే భలే ఉంటుంది కదూ.
చిన్న ప్రాంప్ట్‌తోనే
ఇందుకోసం మీరు మొబైల్‌లో దిగిన ఫొటో ఉంటే చాలు. ఒక చిన్న ప్రాంప్ట్ ఎంటర్ చేయడం ద్వారా డ్రోన్ షాట్‌తో వీడియో తీసిన ఎఫెక్ట్ పొందొచ్చు. అయితే జెమినీఏఐ, చాట్ జీపీటీలో కాకుండా ఇందుకోసం ప్రత్యేక పద్ధతిని ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా గూగుల్ ఓపెన్ చేయాలి.
* ముందుగా మీ మొబైల్‌లో గూగుల్‌ను ఓపెన్ చేయాలి.
* అనంతరం సెర్చ్‌లో గూగుల్ ఫ్లో అని టైప్ చేయాలి.
* ఆ తర్వాత వచ్చే ఫస్ట్ లింక్‌ను క్లిక్ చేయాలి. అనంతరం మీ జీమెయిల్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది.
* ఆ తర్వాత క్రియేట్ విత్ ఫ్లో అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. తర్వాత టెక్ట్స్ టూ వీడియో ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
మీకు నచ్చిన ఫొటోను సెలక్ట్ చేసుకోవాలి.
* ఆ తర్వాత ఫ్రేమ్ టూ వీడియో అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* అనంతరం కింద కనిపించే ప్లస్ బటన్‌ను ఎంచుకోవాలి.
* ఆ తర్వాత అప్‌లోడ్ బటన్‌ను సెలక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
* ఆ ఫొటోను మీకు నచ్చిన విధంగా క్రాప్ చేసుకోవచ్చు.
ప్రాంప్ట్ ఇవ్వాలి.
* ఇలా ఫొటోను సెలక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక టెక్ట్స్ బార్ కనిపిస్తుంది. అందులో ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
* రియలిస్టిక్ డ్రోన్ షాట్ అనే సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ బటన్ నొక్కాలి.
మీ వీడియో రడీ
* సెండ్ బటన్ నొక్కిన తర్వాత కాసేపు లోడ్ అవుతుంది.
* వెంటనే డ్రోన్ షాట్ వీడియో వచ్చేస్తుంది. దానిని ప్లే చేసుకొని చూడొచ్చు.
* కావాలనుకుంటే ఆ వీడియోను డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.