MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Technology
  • ప్రపంచంలోనే అతిపెద్ద AI హ్యాకథాన్ ...58 దేశాలు, 2.8 లక్షల ఉద్యోగులతో టిసిఎస్ రికార్డ్

ప్రపంచంలోనే అతిపెద్ద AI హ్యాకథాన్ ...58 దేశాలు, 2.8 లక్షల ఉద్యోగులతో టిసిఎస్ రికార్డ్

TCS AI hackathon : భారతీయ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రపంచంలోనే అతిపెద్ద AI హ్యాకథాన్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. ఇందులో ఎన్ని దేశాల నుండి ఎంతమంది ఉద్యోగాలు పాల్గొన్నారంటే..

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 16 2025, 09:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టిసిఎస్ సరికొత్త రికార్డు
Image Credit : tcs

టిసిఎస్ సరికొత్త రికార్డు

TCS AI hackathon : భారతీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రపంచంలోనే అతిపెద్ద AI హ్యాకథాన్ నిర్వహించింది. AI హ్యాకథాన్ 2025 మొదటి గ్లోబల్ ఎడిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ హ్యాకథాన్‌లో ప్రపంచవ్యాప్తంగా 58 దేశాల నుంచి 2,81,000 మందికి పైగా టీసిఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

21 విభిన్న పరిశ్రమలకు సంబంధించిన AI థీమ్‌లపై ఆధారపడిన ఈ ఈవెంట్ చాలా వైవిధ్యంగా, ఉద్యోగులందరి భాగస్వామ్యంలో సాగింది. ఇలా లక్షలమంది ఉద్యోగులు పాల్గొనడంతో ఈ హ్యాకథాన్ కొత్త రికార్డు సృష్టించింది. ఇందులో 33% మహిళలు, 53% విదేశీ కార్యాలయాల ఉద్యోగులు, 36% మధ్యస్థ, సీనియర్ స్థాయి ఉద్యోగులు, 38% GenZ వయసు ఉద్యోగులు, 29% నాన్-టెక్నికల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టీసిఎస్ AI హ్యాకథాన్ ఎందుకు నిర్వహించింది?
Image Credit : Reauters

టీసిఎస్ AI హ్యాకథాన్ ఎందుకు నిర్వహించింది?

AI హ్యాకథాన్ నిర్వహించడం వెనుక టీసిఎస్ ముఖ్య ఉద్దేశం ఉద్యోగులకు జెనరేటివ్ AI (GenAI) ప్లాట్‌ఫామ్‌లపై అవగాహన కల్పించడమే. ఇలా తమ ఉద్యోగులు కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంతో పాటు రోజువారీ పనుల్లో AIని ఉపయోగించే అవకాశం ఈ హ్యాకథాన్ ద్వారా కలిగిందంటోంది టీసిఎస్. ఈ హ్యాకథాన్ ద్వారా ఆవిష్కరణలు, నైపుణ్యాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

Related Articles

Related image1
TCS Jobs: ఏఐ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు శుభవార్త, త్వరలో టిసిఎస్ నుంచి 5000 కొత్త ఉద్యోగాలు
Related image2
TCS: టిసిఎస్ నుంచి 12,000 మంది ఉద్యోగులు తొలగింపు, అదికూడా రెండేళ్ల ముందుస్తూ జీతం ఇచ్చి మరీ
35
AI హ్యాకథాన్ ప్రత్యేకతలు
Image Credit : our own

AI హ్యాకథాన్ ప్రత్యేకతలు

AI హ్యాకథాన్ ప్రజలు, ప్లాట్‌ఫామ్‌లు, భాగస్వాములను కనెక్ట్ చేసి ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ఇందులో టాప్ ఏఐ టెక్నాలజీలు, టీసిఎస్ AI విజ్డమ్‌నెక్స్ట్ లాంటి టూల్స్ ఉపయోగించారు. పాల్గొన్నవారికి ఆన్‌లైన్ AI ల్యాబ్స్, ఆఫ్‌లైన్ AI ఫ్రైడే ల్యాబ్స్ యాక్సెస్ లభించింది. దీనివల్ల వారు తమ AI నైపుణ్యాలను మెరుగుపరుచుకోగలిగారు. హ్యాకథాన్ సబ్మిషన్ల మూల్యాంకనంలో కూడా జెనరేటివ్ AIని ఉపయోగించారు. దీంతో మనుషులు, AI కలిసి పెద్ద ఎత్తున పనులు చేయగలిగారు.

45
టీసిఎస్ సిఓఓ ఏమన్నారు?
Image Credit : TCS Ambition Box Website

టీసిఎస్ సిఓఓ ఏమన్నారు?

టీసిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్ ప్రకారం... 2,81,000 మందికి పైగా పాల్గొనడం అంటే ఉద్యోగులందరినీ ఏఐ ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది. ఈ హ్యాకథాన్ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, భవిష్యత్తు పని సంస్కృతిని కలిసి రూపొందించే ఒక మార్గం. ఇది ఉద్యోగులకు AI నేర్చుకోవడానికి, కొత్త టూల్స్ ప్రయత్నించడానికి, క్లయింట్లు, కమ్యూనిటీ కోసం ప్రభావవంతమైన పరిష్కారాలు అందించడానికి అవకాశం ఇస్తుంది.

55
హ్యాకథాన్‌పై టీసిఎస్ భవిష్యత్ ప్రణాళికలు
Image Credit : Getty

హ్యాకథాన్‌పై టీసిఎస్ భవిష్యత్ ప్రణాళికలు

ఈ హ్యాకథాన్ ఇప్పుడు భారతదేశంలోని టీసిఎస్ ప్రధాన క్యాంపస్‌లలో వారానికోసారి 'AI ఫ్రైడేస్' రూపంలో కొనసాగుతుంది. చాలా మంది టీసిఎస్ కస్టమర్లు ఈ ఆవిష్కరణలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే అనేక పరిష్కారాలను టీసిఎస్ ఉత్పత్తులు, క్లయింట్ సేవల్లో ఉపయోగించడంపై ఆలోచిస్తున్నారు. ఏఐ వాడకాన్ని ప్రోత్సహించడంలో, ఉద్యోగుల నైపుణ్యాలను పెంచడంలో, కొత్త పరిష్కారాలను అమలు చేయడంలో టీసిఎస్ ఈ చొరవ ఒక మైలురాయిగా నిలుస్తోంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
కృత్రిమ మేధస్సు
సాంకేతిక వార్తలు చిట్కాలు
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ChatGPT Warning : ఏఐలో వీటి గురించి వెతికారా? పోలీసులు మీ ఇంటికొస్తారు.. బీ కేర్‌ఫుల్
Recommended image2
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image3
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Related Stories
Recommended image1
TCS Jobs: ఏఐ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు శుభవార్త, త్వరలో టిసిఎస్ నుంచి 5000 కొత్త ఉద్యోగాలు
Recommended image2
TCS: టిసిఎస్ నుంచి 12,000 మంది ఉద్యోగులు తొలగింపు, అదికూడా రెండేళ్ల ముందుస్తూ జీతం ఇచ్చి మరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved