- Home
- Business
- TCS Jobs: ఏఐ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు శుభవార్త, త్వరలో టిసిఎస్ నుంచి 5000 కొత్త ఉద్యోగాలు
TCS Jobs: ఏఐ ఇంజనీరింగ్ స్టూడెంట్లకు శుభవార్త, త్వరలో టిసిఎస్ నుంచి 5000 కొత్త ఉద్యోగాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్న విద్యార్థులకు టిసిఎస్ (TCS) శుభవార్త అందించింది. లండన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్ స్టూడియోను టిసిఎస్ ప్రారంభించింది. ఇండియన్లకు ఇందులో ఉద్యోగాలు (Jobs) ఇవ్వడానికి సిద్ధపడింది.

టీసీఎస్ ఉపాధి సృష్టి
టిసిఎస్ మన దేశ అతిపెద్ద సాఫ్ట్ వేర్ సంస్థ. ప్రపంచంలోని ప్రధాన దేశాల్లో టిసిఎస్ కు ఎన్నో కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ ఆన్ సైట్లో పనిచేస్తున్న భారతీయులు ఎంతో మంది. తాజాగా లండన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్ స్టూడియోను టిసిఎస్ ప్రారంభించినట్టు ప్రకటించింది. యూకే ఆర్థిక వ్యవస్థతో టిసిఎస్ కు దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉంది. ఉపాధిని సృష్టించడంలో, ప్రతిభను వెలికి తీయడంలో టీసిఎస్ నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉంటుంది.
లండన్ తో టీసీఎస్ అనుబంధం
లండన్లో ప్రారంభమైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్స్ స్టూడియోలో ఇండియన్లకు కూడా ప్రాధాన్యత ఉండబోతోంది. ఇండియన్ ఏఐ నిపుణులను తీసుకునేందుకు టిసిఎస్ ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటుంది. 50 సంవత్సరాలకు పైగా యూకే సంస్థలతో టిసిఎస్ సాంకేతిక భాగస్వామిగా కొనసాగుతోంది.
అయిదు వేల ఉద్యోగాలు
ప్రస్తుతం లండన్లో ఏఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్స్ స్టూడియో ప్రారంభించిన టిసిఎస్... గతంలో న్యూయార్క్ లో కూడా డిజైన్ స్టూడియోను ప్రారంభించింది. ఇక లండన్లో ప్రారంభించినది రెండవది. లండన్లో స్థాపించిన ఈ డిజైన్ హబ్ వల్ల యూకే లో వచ్చే మూడేళ్లలో 5000 కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఏఐ విద్యార్థుల కోసం వేచి ఉన్నాయి. ఇక పరోక్షంగా కూడా మరి ఉద్యోగాలను టిసిఎస్ ఇవ్వబోతోంది.