Snapchat Subscription: స్నాప్‌చాట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్.. నెలకు ఎంతో తెలుసా..?
నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది స్నాప్‌చాట్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో చాలా మంది స్నాప్ ద్వారా వారి ప్రత్యేక క్షణాలను ఒకరితో ఒకరు షేర్ చేస్కుంటుంటారు. మీరు Snapchatలో మీ ఫ్రెండ్స్ లైవ్ లొకేషన్ కూడా ట్రాక్ చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఎన్నో స్పెషల్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి, ఇవి మీకు గొప్ప యూజర్ అనుభవాన్ని అందించడానికి పని చేస్తాయి.
మీరు స్నాప్‌చాట్‌ని కూడా ఉపయోగిస్తే మీకు ఒక గుడ్ న్యూస్. కొన్ని నివేదికలను విశ్వసిస్తే Snapchat పేమెంట్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ని Snapchat ప్లస్ అని పిలిచే స్పెషల్ ఫీచర్ పరీక్షిస్తోంది. ఈ విషయాన్ని స్నాప్‌చాట్ నిర్మాణ సంస్థ స్నాప్‌చాట్ ఇంక్. ప్రతినిధి లిజ్ మార్క్‌మన్ ధృవీకరించారు. అయితే యూజర్లు స్నాప్‌చాట్ ప్లస్‌ని ఉపయోగించడానికి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవలసి ఉంటుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం -
స్నాప్‌చాట్‌కు సబ్‌స్క్రిప్షన్ పొందిన తర్వాత యూజర్ సాధారణ స్నాప్‌చాట్ యాప్ కంటే ఎక్కువ ఫీచర్లను పొందుతారు. అలాగే స్నాప్‌చాట్ ప్లస్ ఫీచర్‌పై కంపెనీ ఇంటర్నల్ గా పనిచేస్తోందని కంపెనీ ప్రతినిధి లిజ్ మార్క్‌మన్ చెప్పారు.
Snapchat ప్లస్‌లో కస్టమర్‌ల కోసం తాను ప్రత్యేకమైన, ప్రయోగాత్మక అండ్ ప్రీ-రిలీజ్ ఫీచర్‌లను షేర్ చేయనున్నట్లు మార్క్‌మన్ చెప్పారు. నివేదికల ప్రకారం, మీరు స్నాప్‌చాట్ ప్లస్ యాప్‌కి ఒక నెల సబ్‌స్క్రిప్షన్ కోసం దాదాపు రూ.370 చెల్లించాల్సి ఉంటుంది.
6 నెలల సబ్‌స్క్రిప్షన్ కోసం మీరు దాదాపు 2000 రూపాయలు చెల్లించాలి. ఒక సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ ధర దాదాపు రూ. 3750 ఉంటుంది. అయితే, అధికారికంగా స్నాప్‌చాట్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ధరలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కొన్ని నివేదికలను చూస్తే మీరు Snapchat Plusని ఉపయోగించడానికి 6 రోజుల ఫ్రీ ట్రయల్‌ని కూడా పొందవచ్చు. సబ్‌స్క్రిప్షన్ పేమెంట్ కస్టమర్‌ల ప్లే స్టోర్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. యూజర్ దానిని రద్దు చేసే వరకు సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్ గా రిన్యూవల్ అవుతుంది.