MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Technology
  • Mobile Phone: మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు!

Mobile Phone: మీ ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు!

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఫోన్ లేకుండా ఏ పని జరిగే పరిస్థితి లేదు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఫోటోలు, వీడియోలు అన్నీ దాంట్లోనే. అందుకే హ్యాకర్లు ఫోన్ల మీద కన్నేసి, డేటాను దొంగిలించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఫోన్‌ను హ్యాకర్ల నుంచి కాపాడుకోవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Feb 25 2025, 01:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఫోన్ లేకుండా ఎవరైనా ఉన్నారంటే అది చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ప్రతి దానికి ఫోన్ పైనే డిపెండ్ కావాల్సిన పరిస్థితి. పొద్దున లేచిన దగ్గరినుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ పక్కనే ఉంటుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ నుంచి ఆర్థిక వ్యవహారాల వరకు అన్ని దాంట్లోనే. అందుకే సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ మోసాల నుంచి ఫోన్ డేటాను, మనల్ని మనం సులభంగా కాపాడుకోవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.

ప్రత్యేకమైన పాస్‌వర్డ్

మొదటగా మీ స్మార్ట్‌ఫోన్‌కు పటిష్టమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి. పాస్‌వర్డ్ కనీసం 8 అక్షరాలను కలిగి ఉండాలి. పెద్ద, చిన్న అక్షరాలు, సంఖ్యలు, స్పెషల్ క్యారెక్టర్లు కలగలిపి ఉండేలా చూసుకోవాలి. ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ లాక్ కూడా వాడుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్

సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్

స్మార్ట్‌ఫోన్, యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం ముఖ్యం. అప్‌డేట్‌లు పాత సాఫ్ట్‌వేర్‌లోని సమస్యలను సరిచేస్తాయి. ఫోన్‌ను మరింత సేఫ్ చేస్తాయి. ముఖ్యంగా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు అప్‌డేట్ తప్పనిసరి.

35
పబ్లిక్ వైఫై

పబ్లిక్ వైఫై

పబ్లిక్, ఫ్రీ వైఫై నెట్‌వర్క్‌లను వాడకుండా ఉండాలి. ముఖ్యంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు అస్సలు వాడకూడదు. ఈ నెట్‌వర్క్‌లలో డేటాను హ్యాకర్లు ఈజీగా దొంగిలించే అవకాశం ఉంటుంది. అవసరమైతే, విపిఎన్ (VPN) వాడండి.

45
విపిఎన్ సెక్యూరిటీ

విపిఎన్ సెక్యూరిటీ

విపిఎన్ (VPN) ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి, మీ డేటాను సేఫ్ చేస్తుంది. పబ్లిక్ వైఫై వాడేటప్పుడు, విపిఎన్ (VPN) వాడటం వల్ల మీ డేటా హ్యాకర్ల నుంచి సేఫ్ అవుతుంది.

ముఖ్యమైన విషయాలు:

స్మార్ట్‌ఫోన్‌లలో వ్యక్తిగత, ఆర్థిక సమాచారం ఉండటం వల్ల, హ్యాకర్లు వాటిని టార్గెట్ చేస్తారు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లు వాడటం, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం, పబ్లిక్ వైఫైలో జాగ్రత్తగా ఉండటం స్మార్ట్‌ఫోన్ సేఫ్టీకి చాలా ముఖ్యం.

55
మరికొన్ని సేఫ్టీ మెజర్స్:

మరికొన్ని సేఫ్టీ మెజర్స్:

అనుమానాస్పద లింక్స్ లేదా ఈమెయిల్స్ ఓపెన్ చేయకండి.

అధికారిక యాప్స్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.

డేటాను ఎప్పటికప్పుడు బ్యాకప్ తీసుకోండి.

మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్ స్టాల్ చేయండి.

టూ-ఫాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయండి.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ హ్యాక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ భద్రత అంటే మన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని కాపాడుకోవడమే. కాబట్టి, స్మార్ట్‌ఫోన్ సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
Recommended image2
Apple iPhone 18 Pro: ఆపిల్ హిస్టరీలోనే బిగ్ ఛేంజ్.. ఐఫోన్ 18 ప్రోతో పాటు తొలి ఐఫోన్ ఆల్ట్రా.. కెమెరా చూస్తే మైండ్ బ్లాకే
Recommended image3
Jio : గ్లోబల్ దిగ్గజాలు గూగుల్, మెటా లకే సాధ్యంకానిది.. మన జియోకి ఎలా సాధ్యమయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved