ఇక వారితో చాట్ చేయడం కష్టమే.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గట్టి దెబ్బ..
మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు త్వరలో పెద్ద షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. Metaకి చెందిన సోషల్ ప్లాట్‌ఫారమ్‌లు Facebook అండ్ Instagramలో క్రాస్ మెసేజింగ్ ఫీచర్ నిలిపివేయబోతోంది.
Social media
ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ఫేస్‌బుక్ మెసెంజర్‌లకి మెసేజ్ చేయలేరు అలాగే ఫేస్‌బుక్ యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకి డైరెక్ట్ మెసేజ్ చేయలేరు. మూడేళ్ల క్రితమే మెటా ఈ ఫీచర్ కల్పించింది. ఈ సర్వీస్ నిలిపివేయడానికి గల కారణాల గురించి కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు.
9to5Google నివేదిక ప్రకారం, Instagram వినియోగదారులు క్రాస్ యాప్ మెసేజింగ్ గురించి అలర్ట్స్ ఇప్పటికే పొందుతున్నారు. డిసెంబరు మధ్య నాటికి ఈ సర్వీస్ నిలిచిపోతుందని అలర్ట్‌లో చెబుతున్నారు. రిలీఫ్ న్యూస్ ఏమిటంటే, ఈ సర్వీస్ మూసివేయబడిన తర్వాత కూడా వినియోగదారులు చాట్ హిస్టరీని చూడవచ్చు.
సర్వీస్ నిలిపివేయబడిన తర్వాత మీరు కొత్త వారితో క్రాస్ యాప్ చాటింగ్ చేయలేరు, కానీ మీరు వచ్చిన మెసేజెస్ చూడగలరు. ఇన్‌స్టాగ్రామ్ లాగే ఈ తరహా అప్‌డేట్ ఫేస్‌బుక్‌లో కూడా ఉంటుంది, అంటే ఫేస్‌బుక్ వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు మెసేజ్ చేయలేరు, కానీ పాత చాట్‌లను చూడగలరు. Instagram అండ్ Facebook Messenger యాప్‌లలో క్రాస్ మెసేజింగ్ ఫీచర్ 2020లో ప్రారంభించబడింది.
ఈ ఏడాది ఆగస్టులో, క్రాస్ మెసేజింగ్ కూడా E2EE ఎన్క్రిప్టెడ్ అని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా జరుగుతుందని కంపెనీ చెప్పింది. ఈ ఎన్‌క్రిప్షన్ కంపెనీ ఇప్పటికే ఇన్‌స్టంట్ మల్టీమీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తో కూడా అందిస్తోంది.