- Home
- Technology
- Samsung Vs LG : ఈ పండగల సీజన్లో స్మార్ట్ టివి కొనాలనుకుంటున్నారా? ఏది బెస్ట్ బ్రాండ్?
Samsung Vs LG : ఈ పండగల సీజన్లో స్మార్ట్ టివి కొనాలనుకుంటున్నారా? ఏది బెస్ట్ బ్రాండ్?
కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారి కోసం శాంసంగ్, ఎల్జీ బ్రాండ్ల ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను టెక్ నిపుణులు పోల్చి చూశారు. మరి ఏది బెస్ట్ అని తేల్చారో ఇక్కడ చూద్దాం.

బెస్ట్ స్మార్ట్ టీవీ బ్రాండ్ ఏది?
మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు శాంసంగ్, ఎల్జీ. 'కన్స్యూమర్ రిపోర్ట్స్' ఇచ్చిన ర్యాంకింగ్స్‌లో ఈ రెండు బ్రాండ్లు టాప్‌లో నిలిచాయి. 2026 సంవత్సరానికి గానూ బెస్ట్ టీవీగా Samsung QN65S90F మోడల్ ఎంపికైంది.
అయితే శాంసంగ్; ఎల్జీ స్మార్ట్ టీవీల డిస్‌ప్లే క్వాలిటీతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్, ఏఐ ఫీచర్లు ఎలా ఉన్నాయోఇక్కడ తెలుసుకుందాం. తద్వారా కొనేందుకు ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.
స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్
శాంసంగ్ టీవీలు 'టైజెన్' (Tizen) ఆపరేటింగ్ సిస్టమ్ (OS) తో వస్తే, ఎల్జీ టీవీల్లో 'వెబ్ఓఎస్' (webOS) వాడుతున్నారు. టెక్‌రాడార్, పాకెట్-లింట్ లాంటి టెక్ వెబ్‌సైట్లు శాంసంగ్ కంటే ఎల్జీ వెబ్ఓఎస్ వాడటానికి చాలా బాగుందని చెబుతున్నాయి.
ఎల్జీ టీవీలో సెట్టింగ్స్ మెనూ ఎడమవైపు వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ మార్చేటప్పుడు స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ శాంసంగ్‌లో సెట్టింగ్స్ విండో మధ్యలో రావడం కాస్త ఇబ్బందిగా ఉంటుందట.
శాంసంగ్ బిక్స్‌బీ vs ఎల్జీ థింక్ ఏఐ
ఎల్జీ, శాంసంగ్ స్మార్ట్ టీవీల్లో గూగుల్ అసిస్టెంట్ సేవలను ఆపేశారు. ఇప్పుడు రెండు బ్రాండ్లు అమెజాన్ అలెక్సాను మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. గూగుల్ అసిస్టెంట్ బదులు రెండు కంపెనీలు 'మైక్రోసాఫ్ట్ కోపైలట్' ఏఐని తీసుకొచ్చాయి.
అయితే ఎల్జీ యూజర్లు ఫైర్ అవ్వడంతో, 2025 డిసెంబర్‌లో ఆ ఐకాన్‌ను హైడ్ చేసే ఆప్షన్ ఇచ్చారు. శాంసంగ్ టీవీల్లో ఈ ఏఐని తీసేయడం కష్టంగా ఉందని యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. టామ్స్ గైడ్ రివ్యూ ప్రకారం శాంసంగ్ బిక్స్‌బీ, ఎల్జీ థింక్ ఏఐ రెండూ యూజర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
ఫైనల్ రిపోర్ట్
టెక్ నిపుణుల రిపోర్ట్ ప్రకారం… ఏఐ వాయిస్ అసిస్టెంట్ల కంటే ఆపరేటింగ్ సిస్టమ్ వాడటానికి ఎంత ఈజీగా ఉందనేదే టీవీ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. ఈ విషయంలో ఎల్జీకి చెందిన webOS కాస్త ముందు వరుసలో ఉందట. ఆ తర్వాత బెస్ట్ ఆప్షన్‌గా శాంసంగ్ Tizen OS నిలిచింది.

