బెస్ట్ పర్ఫర్మేన్స్, మెరుగైన ప్రాసెసర్‌తో రియల్‌మీ కొత్త 5జి స్మార్ట్ ఫోన్.. ప్రపంచంలోనే మొట్టమొదటిది..
చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ ఇటీవల కొత్త చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 778జి 5జిని విడుదల చేసింది. ఈ కొత్త 5జి ప్రాసెసర్‌ను ప్రారంభించడంతో పాటు రియల్‌మీ ఈ ప్రాసెసర్‌తో వచ్చే ఫోన్‌ను కూడా ప్రకటించింది.
778జి 5జి ప్రాసెసర్‌తో లాంచ్ కానున్న ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ క్విక్‌సిల్వర్ అవుతుందని సంస్థ తెలిపింది. రియల్‌మీ క్విక్‌సిల్వర్ ఒక ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్, ఇది షియోమి, మోటరోలా, ఒప్పో, వివో వంటి సంస్థ ఫోన్ లతో పోటీపడుతుంది. కాకపోతే రియల్‌మీ ఫోన్ లాంచ్ తేదీ గురించి అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, కానీ ఈ సంవత్సరం చివరి నాటికి, మొదటి బ్యాచ్ స్నాప్‌డ్రాగన్ 778జి 5జి ఫోన్ మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
రియల్‌మీ రాబోయే ఫోన్ రియల్‌మీ క్విక్‌సిల్వర్ ఫీచర్స్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. స్నాప్‌డ్రాగన్ 778జి 5జి అనేది 6జిఎమ్ ప్రాసెస్‌పై నిర్మించిన 5జి ప్రాసెసర్. ఇందులో క్వాల్‌కామ్ క్రియో 670 సిపియు అందించారు, ఇది 40 శాతం మెరుగైన ప్రాసెసింగ్, 40 శాతం మెరుగైన జిపియు పనితీరును కనబరుస్తుందని పేర్కొంది.
ఈ ఫోన్‌కు జిటి మోడ్, కొత్త కూలింగ్ సిస్టం లభిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా రాబోయే ఫోన్ రియల్‌మీ జిటి సిరీస్‌లో భాగంగా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నయి. అయితే, రియల్‌మీ ప్రాసెసర్‌ను ప్రకటించడంతో పాటు ఆ ప్రాసెసర్‌తో మొదటి ఫోన్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు.