Real me Narzo 80 Lite 5 జీ...పెద్ద బ్యాటరీతో..ధర ఎంతో తెలుసా!
రియల్‌మీ (Realme) బడ్జెట్ ధరలో దేశీయంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ కంపెనీ, తాజాగా రియల్‌మీ నార్జో 80 లైట్ (Realme Narzo 80 Lite) పేరుతో మరో శక్తివంతమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది.

రియల్‌మీ నార్జో 80 లైట్
ప్రముఖ టెలికాం బ్రాండ్ రియల్‌మీ (Realme) బడ్జెట్ ధరలో దేశీయంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే నార్జో 80 ఎక్స్, నార్జో 80 ప్రో వేరియంట్లను మార్కెట్‌లోకి తెచ్చిన ఈ కంపెనీ, తాజాగా రియల్‌మీ నార్జో 80 లైట్ (Realme Narzo 80 Lite) పేరుతో మరో శక్తివంతమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది.
ముఖ్యమైన స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.67 అంగుళాల స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్,ప్రాసెసర్: ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్‌సిటీ 6300,ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0, గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్‌తో,కెమెరా: 32MP ప్రధాన కెమెరా, ఏఐ ఇమేజింగ్, ఏఐ క్లియర్ ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్, 15W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్ ఛార్జింగ్
ఐపీ రేటింగ్: IP64 వాతావరణ నిరోధకత
బరువు: 197 గ్రాములు, మందం 7.94 మిల్లీమీటర్లు
ధరలు, కలర్స్, లభ్యత
4GB + 128GB వేరియంట్ ధర: ₹10,499,6GB + 128GB వేరియంట్ ధర: ₹11,499,వేరియంట్‌ను బట్టి రూ.700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది రంగులు: ఒనిక్స్ బ్లాక్ లో లభిస్తుంది.
మంచి ఎంపిక
5జీ కనెక్టివిటీ, భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిస్‌ప్లేతో బడ్జెట్ ధరలో వచ్చిన రియల్‌మీ నార్జో 80 లైట్ యువతను ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రూ.11వేల కింద 5జీ ఫోన్‌ను కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.