సూపర్ బేస్, నాన్-స్టాప్ మ్యూజిక్ తో రియల్‌మీ కొత్త వైర్‌లెస్ బడ్స్.. కేవలం 10ని'ల చార్జ్ తో 120 ని'ల బ్యాకప్
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియోను శ్రీలంకలో విడుదల చేసింది. ఈ రియల్‌మీ నెక్‌బ్యాండ్ బ్యాటరీ 17 గంటల బ్యాక్ అప్ క్లెయిమ్ చేయబడింది. నేడు మలేషియాలో రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో లాంచ్ వేడుక జరిగింది.
శ్రీలంకలో కూడా వీటి సేల్స్ ప్రారంభమయ్యాయి. దీనిలో 88 ఎంఎస్ సూపర్ లో లాటెన్సీ మోడ్ ఉంది. అంతే కాకుండా వాటర్ రెసిస్టెంట్ కోసం IPX4 రేటింగ్ చేయబడింది. రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో ధర ఇండియాలో సుమారు రూ.3,000. దీనిని డరాజ్.కామ్ నుండి విక్రయిస్తున్నారు. క్యాండి బ్లాక్, క్యాండి బ్లూ, క్యాండి గ్రీన్ వంటి మూడు రంగులలో దీనిని కొనుగోలు చేయవచ్చు.
రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో ఫీచర్లు
ఈ రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియో ఫ్రీక్వెన్సీ పరిధి 20Hz నుండి 20,000KHz వరకు ఉంటుంది. దీని డ్రైవర్ సైజ్ 11.2 ఎంఎం. దీని బ్యాటరీ 17 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తో 120 నిమిషాల ప్లేబ్యాక్ మ్యూజిక్ లభిస్తుందని రియల్‌మీ పేర్కొంది. ఛార్జింగ్ కోసం యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఇచ్చారు. దీన్ని రెండు గంటల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీని మొత్తం బరువు 23.1 గ్రాములు. ఈ నెక్‌బ్యాండ్‌ను రియల్‌మీ లింక్ యాప్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు.
ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (ఈఎన్‌సి) రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 2 నియోలో లభిస్తుంది. అంతేకాకుండా వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపిఎక్స్ 4 రేట్ పొందింది. దానిలో ఒక ప్రత్యేక ఫీచర్ ఉంది, అదేంటంటే రెండు బడ్స్ వేరు చేసిన వెంటనే అవి ఫోన్‌కు కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే దీనికి మాగ్నెమాగ్నెట్ బడ్స్ ఇచ్చారు.