ఎక్సైటింగ్ ఫీచర్స్ తో వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్.. లాంచ్‌కు ముందే లీక్.. బయటపడ్డా ఫీచర్లు..
చైనీస్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వన్ ప్లస్(oneplus) అప్ కమింగ్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ ఆర్‌టి (oneplus RT) ధర లీక్ అయింది. కొత్త నివేదికలో వన్ ప్లస్ ఆర్‌టి 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్‌లో అందించనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్‌లో కొనుగోలు చేసే అవకాశం కూడా లభిస్తుంది.
ఈ కొత్త ఫోన్ వన్ ప్లస్9ఆర్‌టికి రీ-బ్రాండెడ్ వెర్షన్. చైనీస్ మార్కెట్‌లో వన్ ప్లస్ ఆర్‌టి ప్రారంభ ధర 3,299 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 38,800.
భారతదేశంలో వన్ ప్లస్ ఆర్‌టి ధర
లీక్ అయిన నివేదిక ప్రకారం, భారతీయ మార్కెట్‌లో వన్ ప్లస్ ఆర్‌టి 8 జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999. అంతేకాకుండా ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 37,999 అని మరొక నివేదికలో తెలిపింది. వన్ ప్లస్ ఆర్‌టి 6జిబి ర్యామ్ , 128 జిబి స్టోరేజ్ ధర రూ. 34,999కి అందించవచ్చు. వన్ ప్లస్ ఆర్‌టి డిసెంబర్ 16న భారతదేశంలో ప్రారంభించనుంది.
వన్ ప్లస్ ఆర్‌టి ఫీచర్స్
వన్ ప్లస్ ఆర్‌టి ఫీచర్స్ వన్ ప్లస్9ఆర్‌టిని పోలి ఉంటాయి. వన్ ప్లస్ ఆర్‌టిలో 1080x2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62ఫుల్ పూర్తి హెచ్‌డి ప్లస్ ఈ4 ఆమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీని ప్రైమరీ లెన్స్ 50 మెగాపిక్సెల్‌లుగా ఉంటుంది.
రెండవ లెన్స్ 16 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో, సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. కనెక్టివిటీ కోసం ఫోన్ 5జి, 4జి ఎల్‌టిఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, జిపిఎస్ / A-GPS, ఎన్‌ఎఫ్‌సి, టైప్-సి పోర్ట్‌లను పొందుతుంది. అలాగే 65T ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500mAh బ్యాటరీ అందించారు.