5జి సపోర్ట్ తో నోకియా ఒకేసారి 6 స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్.. బడ్జెట్ ధరకే బెస్ట్ ఫీచర్స్..
ఫిన్నిష్ మల్టీ నేషనల్ కంపెనీ నోకియా తాజాగా సి సిరీస్ నుండి రెండు, జి సిరీస్ నుండి రెండు, ఎక్స్ సిరీస్ నుండి రెండు మొత్తం ఆరు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో నోకియా సి10, నోకియా సి20, నోకియా జి10, నోకియా జి20, నోకియా ఎక్స్10, నోకియా ఎక్స్ 20 ఉన్నాయి.
నోకియా సి సిరీస్ ఎంట్రీ లెవల్ ఫోన్స్ కాగా, నోకియా జి సిరీస్ మిడ్‌రేంజ్ విభాగానికి, నోకియా ఎక్స్ సిరీస్ ప్రీమియం విభగానికి చెందినవి. నోకియా సి 10, నోకియా సి 20 లలో ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్, నోకియా జి10, నోకియా జి20, నోకియా ఎక్స్10, నోకియా ఎక్స్20లో స్టాక్ ఆండ్రాయిడ్ 11 లభిస్తుంది. నోకియా ఎక్స్ 10, నోకియా ఎక్స్ 20లో 5జి కనెక్టివిటీ ఆప్షన్స్ అందించారు.
ధరలు
నోకియా సి10 ప్రారంభ ధర 79 యూరోలు అంటే సుమారు 7,000 రూపాయలు. ఈ ధర వద్ద 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. నోకియా సి20 ప్రారంభ ధర 89 యూరోలు అంటే 7,900 రూపాయలు. నోకియా జి10 ప్రారంభ ధర 139 యూరోలు, అంటే సుమారు 12,300 రూపాయలు, నోకియా జి20 ప్రారంభ ధర 159 యూరోలు, అంటే సుమారు 14,000 రూపాయలు.
నోకియా ఎక్స్ 10 ప్రారంభ ధర 309 యూరోలు, అంటే సుమారు 27,400 రూపాయలు, నోకియా ఎక్స్ 20 ధర 349 యూరోల ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో వీటి లభ్యత గురించి సమాచారం లేదు. ఈ ఫోన్లతో పాటు 39 యూరోల ధర కలిగిన నోకియా లైట్ ఇయర్‌బడ్స్‌ను కూడా కంపెనీ ప్రవేశపెట్టింది. ఇండియాలో వీటి ధర సుమారు 3,500 రూపాయలు.
నోకియా సి10 స్పెసిఫికేషన్లు
ఓకియా సి 10 కి ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్), 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, 2డి పాండా గ్లాస్ ప్రొటెక్షన్, యునిసోక్ ఎస్సీ 7331 ఇ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. దీనిని మెమరీ కార్డ్ సహాయంతో పెంచవచ్చు. ఈ ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీనికి 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు ఇది 10W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
నోకియా సి20 స్పెసిఫికేషన్
నోకియా సి20లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్, 2డి పాండా గ్లాస్ ప్రొటెక్షన్, 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, యునిసోక్ ఎస్సి 9863 ఎ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 32 జిబి వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. కెమెరాతో పాటు హెచ్‌డిఆర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) బ్యూటీ మోడ్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎఫ్‌ఎం రేడియో, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
నోకియా జి10 స్పెసిఫికేషన్లు
నోకియా జి 10 ఆండ్రాయిడ్ 11, 720x1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, మీడియాటెక్ హెలియో జి25 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. దీనికి మూడు వెనుక కెమెరాలు ఇచ్చారు, ఇందులో మొదటి లెన్స్ 13 మెగాపిక్సెల్స్, రెండవది 2 మెగాపిక్సెల్స్, మూడవది 2 మెగాపిక్సెల్స్ మాక్రో లెన్స్, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీనిలో 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎఫ్‌ఎం రేడియో, టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
నోకియా జ20 స్పెసిఫికేషన్లు
నోకియా జి20లో ఆండ్రాయిడ్ 11, 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, మీడియాటెక్ హెలియో జి35 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 128 జిబి వరకు స్టోరేజ్, ఈ ఫోన్‌లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి వీటిలో ప్రైమరీ లెన్స్ 48 మెగాపిక్సెల్ లెన్స్. రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. దీనికి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, ఎఫ్ఎం రేడియో, టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
నోకియా ఎక్స్10 స్పెసిఫికేషన్లు
నోకియా ఎక్స్ 10 లో ఆండ్రాయిడ్ 11, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్‌ల ప్రధాన లెన్స్‌తో జీస్ ఆప్టిక్స్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్, నాలుగోవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ లెన్స్ కెమెరా ఉంది. దీనిలో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, ఎఫ్ఎం రేడియో, టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.
నోకియా ఎక్స్ 20 స్పెసిఫికేషన్లు
నోకియా ఎక్స్ 20 లో ఆండ్రాయిడ్ 11, 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో జీస్ ఆప్టిక్స్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్స్. రెండవ లెన్స్ 5 మెగాపిక్సెల్స్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్, నాలుగోవది 2 మెగాపిక్సెల్స్ మాక్రో లెన్స్. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ లెన్స్ కెమెరా ఉంది. దీనిలో 5జి, 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, ఎఫ్ఎం రేడియో, టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.