డ్యూయల్ రియర్ కెమెరా, భారీ బ్యాటరీతో నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ప్రత్యేకమైన ఫీచర్స్ తెలుసా ?
హెచ్‌ఎండి గ్లోబల్ నోకియా కంపెనీ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్ నోకియా 1.4 ను విడుదల చేసింది. ఈ ఫోన్ గత ఏడాది మార్చిలో ప్రారంభించిన నోకియా 1.3 కి అప్‌గ్రేడ్ వెర్షన్ గా వస్తుంది. నోకియా 1.3 ఫోన్ లో సింగిల్ రియర్ కెమెరా సెటప్ ఉండగా, నోకియా 1.4 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు.
ఇది కాకుండా నోకియా ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఇచ్చింది. నోకియా 1.3ఫోన్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ చేశారు. నోకియా 1.4 ఈ కొత్త ఫోన్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ...
నోకియా 1.4 ధర
నోకియా 1.4 ప్రారంభ ధర $ 99 డాలర్లు అంటే ఇండియాలో సుమారు 7,200 రూపాయలు. 1 జీబీ ర్యామ్‌తో 16 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ 2 జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్, లేదా 32 జిబి స్టోరేజ్, 3 జిబి ర్యామ్ తో కూడా లభిస్తుంది, అయితే ప్రస్తుతానికి ఇతర వేరియంట్ల ధర, లభ్యత గురించి సమాచారం లేదు.
నోకియా 1.4 స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో ఆండ్రాయిడ్ 10 (గో ఎడిషన్)తో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) అప్ డేట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.51 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, క్వాల్కమ్ 215 ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 64 జిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది. ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించగ, దీనిలో ఒక లెన్స్ 8 మెగాపిక్సెల్స్ కెమెరా, మరొకటి 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో వస్తుంది. అలాగే సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
మెమరీ కార్డ్ సహాయంతో ఫోన్ స్టోరేజ్ 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇది కాకుండా కనెక్టివిటీ కోసం 4జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ వి 4.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎఫ్‌ఎం రేడియో, మైక్రో యుఎస్‌బి, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 5W ఛార్జింగ్ కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ బరువు 178 గ్రాములు.