ఎవరూ తెలుసుకోలేరు ! వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ ! సెక్యూరిటీలో కొత్త సిస్టమ్, మీరు తెలుసుకోవలసినదీ ఇదే..
మెటా యాజమాన్యంలోని WhatsApp యూజర్ల కోసం సెక్యూరిటీ ఫీచర్‌ను మెరుగుపరుస్తుంది. వాట్సాప్ కాల్స్‌లో ఐపి అడ్రస్‌ను ప్రొటెక్ట్ చేయడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కాల్‌లో ఉన్న ఇతర వ్యక్తి మీ లొకేషన్ అండ్ IP అడ్రస్ తీలుసుకోలేరు. రాబోయే రోజుల్లో, ప్రయోగాత్మకంగా సెలెక్ట్ చేసిన బీటా యూజర్లకు ఈ కావలసిన ఫీచర్‌లు అందుబాటులోకి వస్తాయి.
ప్రైవసీ సెట్టింగ్‌ల పేజీలో ఈ కొత్త ఫీచర్ వస్తుంది. మీరు కాల్‌లో ఉన్నప్పుడు ప్రైవేట్ IP అడ్రస్ అప్షన్ పొందుతారు. కొత్త ఫీచర్ ప్రకారం, కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. సెక్యూరిటీ ఫీచర్‌ను పెంచడం వల్ల కాల్ క్వాలిటీ పై ప్రభావం పడవచ్చని కూడా నివేదించారు.
వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీనిని రెండు ఫోన్ నంబర్‌లను ఉపయోగించే వారికోసం కోసం తీసుకొచ్చారు. యాప్ ద్వారా ఒకేసారి మల్టి అకౌంట్స్ లాగిన్ చేయవచ్చు అది కూడా ఒకే ఫోన్లో. ఈ ఫీచర్ ఇప్పటికే టెలిగ్రామ్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, మల్టి WhatsApp అకౌంట్స్ ఉన్న వారు క్లోన్ యాప్‌ని లేదా బిజినెస్ WhatsApp యాప్ పై ఆధారపడతారు. కానీ కొత్త ఫీచర్‌తో యూజర్లు ఒకే యాప్ ద్వారా రెండు అకౌంట్స్లోకి లాగిన్ చేయవచ్చు.
దీని కోసం, డ్యూయల్ సిమ్ ఎనేబుల్డ్ ఫోన్‌లకు రెండు సిమ్ కార్డ్ కనెక్షన్‌లు అవసరం. తర్వాత వాట్సాప్ సెట్టింగ్స్‌ని ఓపెన్ చేసి మీ పేరు పక్కన ఉన్న చిన్న గుర్తును నొక్కండి. ఇక్కడ 'add account' సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు రెండవ మొబైల్ నంబర్‌ని టైప్ చేసి, వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి. కొత్త అకౌంట్ యాడ్ అవుతుంది. పేరు పక్కన ఉన్న బాణం గుర్తును క్లిక్ చేయడం ద్వారా మీరు అకౌంట్స్ మార్చుకోవచ్చు.