అమేజ్ ఫిట్ జిటిఎస్ 2 కొత్త వెర్షన్.. ఇప్పుడు కాలింగ్ ఫీచర్‌తో మరిన్ని అప్ డేట్స్..
మీరు Amazfit నుండి కాలింగ్‌తో కూడిన స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నట్లయితే మీకు గుడ్ న్యూస్. Amazfit GTS 2 కొత్త వెర్షన్ జూన్ 5న ఇండియాలో లాంచ్ కానుంది. Amazfit GTS 2 కొత్త వెర్షన్‌లో బ్లూటూత్ కాలింగ్ సౌకర్యం అందించారు. అంతేకాకుండా HD AMOLED డిస్ ప్లే ఇందులో ఉంటుంది.
Amazfit GTS 2 కొత్త వెర్షన్ అమెజాన్ ఇండియా ఇంకా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయించనుంది. Amazfit GTS 2 కాలింగ్ వెర్షన్ ధర రూ. 10,999తో అందుబాటులోకి వస్తుంది, అయితే ఆ ఆఫర్ లాంచ్ ధర మాత్రమే. తరువాత, Amazfit GTS 2 ధర రూ. 11,999కి లభిస్తుంది.
Amazfit GTS 2 కొత్త వెర్షన్ కి 1.65-అంగుళాల AMOLED స్క్రీన్ ఉంది. దీనిని మిడ్‌నైట్ బ్లాక్, డెజర్ట్ గోల్డ్ లేదా అర్బన్ గ్రే అల్యూమినియం అల్లాయ్ కేస్ అండ్ మ్యాచింగ్ స్ట్రాప్‌తో లభిస్తుంది. వాచ్ డిస్‌ప్లే ఆప్టికల్ డైమండ్ లాంటి కార్బన్ (ODLC) ఇంకా 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో యాంటీ ఫింగర్‌ప్రింట్ కోటింగ్‌లతో తయారు చేయబడింది, ఇది స్క్రీన్‌ను అనూహ్యంగా బలంగా చేస్తుంది ఇంకా గీతలు పడకుండా చేస్తుంది.
ఈ వాచ్ 50కి పైగా వాచ్ ఫేస్ ఆప్షన్స్ తో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లేతో వస్తుంది. హార్ట్ బీట్ మానిటర్‌తో పాటు బయోట్రాకర్ 2 PPG ఆప్టికల్ సెన్సార్‌ను కూడా పొందుతుంది. రక్తంలోని ఆక్సిజన్‌ను ట్రాక్ చేసే సెన్సార్ కూడా ఇందులో ఉంది.
Amazfit GTS 2 కొత్త వెర్షన్ కూడా స్లీప్ ట్రాకింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులో ఒత్తిడిని పర్యవేక్షించే సదుపాయం కూడా ఉంది. Amazfit GTS 2 కొత్త వెర్షన్ 90 ఇంటర్నల్ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. స్మార్ట్‌వాచ్ 5 ATMలకు వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఈత కొట్టేటప్పుడు లేదా కఠినమైన పరిస్థితుల్లో పని చేస్తున్నప్పుడు మీ పనిని ట్రాక్ చేయవచ్చు.
Amazfit GTS 2లో 3జిబి స్టోరేజ్ ఉంది, దీనిలో మీరు మ్యూజిక్ స్టోర్ చేయవచ్చు. ఇంకా కాల్ చేయడానికి మైక్ అండ్ స్పీకర్ ఉంది. ఇంకా ఈ వాచ్‌లో సెక్యూరిటి కోసం పాస్‌వర్డ్ కూడా ఉంది. అలాగే అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.