MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • దీపావళి బంపర్ ఆఫర్ ఇచ్చిన ముఖేష్ అంబానీ.. జస్ట్ రూ.2599 మాత్రమే.. క్యాష్‌బ్యాక్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ కూడా..

దీపావళి బంపర్ ఆఫర్ ఇచ్చిన ముఖేష్ అంబానీ.. జస్ట్ రూ.2599 మాత్రమే.. క్యాష్‌బ్యాక్ డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ కూడా..

ప్రతి దీపావళి పండుగకు ఎన్నో  బ్రాండ్లు  కంపెనీ  ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. అయితే దేశంలోని అత్యంత సంపన్నుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ కూడా ప్రతి దీపావళి పండుగకు కొత్త ఉత్పత్తిని విడుదల చేయడం మర్చిపోరు.

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 04 2023, 06:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

 గత కొన్ని సంవత్సరాలుగా దీపావళి పండుగ సందర్భంగా ముఖేష్ అంబానీ అనేక కొత్త ఉత్పత్తులను విడుదల చేశారు. అలాగే ఈ ఏడాది దీపావళికి జనాలు కొనుక్కోగలిగే తక్కువ ధర ఆండ్రాయిడ్ మొబైల్‌ని విడుదల చేశారు. 

తక్కువ ధరలో JioPhone Prima 4G ఇండియాలో ప్రారంభించారు. దీని ధర కేవలం రూ.2,599 మాత్రమే. Jiophone Prima 4Gలో WhatsApp ఇంకా  YouTube కూడా  ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంత చౌకైన ఫోన్లలో ఈ ఫోన్  ఒకటి. గత కొన్ని నెలల్లో ముఖేష్ అంబానీ లాంచ్ చేసిన రెండో 4G ఫోన్ ఇదే. ముఖేష్ అంబానీ అతని కుమారుడు ఆకాష్ అంబానీ 2G యుగంలో 25 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులను ఆండ్రాయిడ్ ఫోన్‌లకు తీసుకురావడానికి కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

రిలయన్స్ రిలయన్స్ ప్రారంభించిన జియోఫోన్ ప్రైమా 4G
గతంలో భారతదేశంలో జియో భారత్ V2 ఫోన్‌ను రూ. 999కి విడుదల చేసింది. ఇప్పుడు మరిన్ని ఫీచర్లు, యాక్సెస్‌ అందించడానికి రిలయన్స్ జియో ఇప్పుడు దీపావళికి ముందు భారతదేశంలో JioPhone ప్రైమా 4Gని ప్రారంభించింది. ఇందులో మీరు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్ మొదలైన వాటిని ఆస్వాదించవచ్చు.

ముఖేష్ అంబానీ కొత్త JioPhone Prima 4G JioMartలో బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఫోన్‌పై క్యాష్‌బ్యాక్ డీల్స్, బ్యాంక్ ఆఫర్‌లు, కూపన్‌లు వంటి అనేక ఆఫర్‌లు కూడా ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే, కొత్త JioPhone Prima 4G మార్కెట్‌లో చౌక ధరలో లభించే మరో ఫీచర్ ఫోన్‌లా కనిపిస్తుంది.
 

33

పేరు సూచించినట్లుగా, ఫోన్ 4G కనెక్టివిటీ, 23 భాషలకు సపోర్ట్ తో వస్తుంది. JioPhone Prima 4G ARM Cortex A53 ప్రాసెసర్‌తో 128GB ఎక్స్పన్దబుల్  స్టోరేజ్ తో  వస్తుంది. ఈ డివైజ్  KaiOSలో రన్ అవుతుంది,  చెప్పాలంటే Firefox OS ఆధారంగా 1200 యాప్‌లకు సపోర్ట్  ఇచ్చే ఆపరేటింగ్ సిస్టమ్. ఫోన్ సింగిల్ సిమ్, 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో వస్తుంది. ఈ ఫీచర్లన్నీ  1800mAh బ్యాటరీతో అందించబడ్డాయి.
 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఫోన్‌లో చూస్తూ చెవిలో గులిమిని క్లీన్ చేసుకోవ‌చ్చు.. అదిరిపోయే స్మార్ట్ గ్యాడ్జెట్
Recommended image2
ఇంత త‌క్కువ ధ‌ర‌లో ఇలాంటి ఫోన్ ఏంటి భ‌య్యా.. మోడ‌ల్, ఫీచ‌ర్స్‌ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Recommended image3
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved