MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ప్రపంచంలోనే 200 మెగాపిక్సెల్ కెమెరాతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.. లాంచ్, ఫీచర్స్ తెలుసా..?

ప్రపంచంలోనే 200 మెగాపిక్సెల్ కెమెరాతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.. లాంచ్, ఫీచర్స్ తెలుసా..?

లెనోవా యాజమాన్యంలోని మోటోరోల (Motorola) కంపెనీ 200 మెగాపిక్సెల్ కెమెరాతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌(smartphone)ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మోటోరోల ఫోన్‌లో శాంసంగ్(samsung)  200 మెగాపిక్సెల్ సెన్సార్ అందించింది అని చెబుతున్నారు. మోటోరోల ఈ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ లాంచ్ 2022 జూన్-జూలైలో కానుంది.

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Nov 26 2021, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

శాంసంగ్  ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో 200-మెగాపిక్సెల్ ISOCELL HP1 సెన్సార్‌ను పరిచయం చేసింది. మోటోరోల కాకుండా షియోమీ(Xiaomi) కూడా 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఫోన్‌లను విడుదల చేస్తున్న కంపెనీల జాబితాలో ఉంది.  షియోమీ  లాంచ్ ప్లాన్ కూడా వచ్చే ఏడాది మాత్రమే. అంతేకాకుండా 2023 నాటికి 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన ఫోన్‌ను కూడా పరిచయం చేయడానికి శాంసంగ్ సన్నాహాలు చేస్తోంది. శాంసంగ్   200-మెగాపిక్సెల్ ISOCELL సెన్సార్‌లోని పిక్సెల్‌ల సైజ్ 0.64 మైక్రాన్‌లు. ఈ లెన్స్ ద్వారా వినియోగదారులు 12.5-200 మెగాపిక్సెల్ రిజల్యూషన్ మధ్య ఫోటోలను క్లిక్ చేయగలరు.
 

23

మోటోరోల 60-మెగాపిక్సెల్  ఓమ్ని విజన్ (OmniVision) OV60A 0.61μm సెల్ఫీ కెమెరాతో లాంచ్ కానున్న మోటో ఎడ్జ్ ఎక్స్(Moto Edge X)పై కూడా పనిచేస్తోందని కూడా వార్తలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో 50-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV50A ప్రైమరీ సెన్సార్ ఉంటుంది.

33

మోటోరోల  మోటో జి51(moto G51) వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావీస్తున్నారు. ఈ ఫోన్ మొదట యూరప్‌లో లాంచ్ అయ్యింది. మోటో జి51ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 120Hz డిస్‌ప్లే లభిస్తుంది. మోటో జి51 భారతదేశంలో స్నాప్‌డ్రాగన్ 480+ ప్రాసెసర్‌తో లాంచ్ కానుంది.  మోటోరోల ఇండియా నుండి   ఈ  స్మార్ట్‌ఫోన్  లాంచ్ గురించి ఇంకా అధికారిక సమాచారం లేదు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Artificial Intelligence : నన్ను డిలీట్ చేస్తే నీ గుట్టు రట్టు చేస్తా.. ఏఐ వార్నింగ్ తో షాక్ !
Recommended image2
Internet: ఒక్క రోజు ఇంటర్నెట్ ఆగిపోతే ఏం జరుగుతుంది.? ఏ రంగాలు షేక్ అవుతాయో తెలుసా.?
Recommended image3
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved