Moto E32s:మోటోరోల బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. స్టాండర్డ్ ఫీచర్స్ తో అతితక్కువ ధరకే అందుబాటులోకి..
లెనోవా యాజమాన్యంలోని మోటోరోల (Motorola) ఇండియాలో కొత్త మోటో ఈ32ఎస్ (Moto E32s) ఫోన్‌ను లాంచ్ చేసింది. Moto E32s అనేది 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో కూడిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్. అంతేకాకుండా Moto E32sలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 Moto E32sలో MediaTek Helio G37 ప్రాసెసర్‌తో అందించారు. Moto E32s రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని కంపెనీ హామీ ఇచ్చింది. మోటో E32s రెడ్ మీ 10A, Realme C31 అండ్ రెడ్ మీ 10 వంటి ఫోన్‌లతో పోటీపడుతుంది.
ధర
మోటో ఈ32ఎస్ ధర రూ. 8,999, అయితే ఇది లాంచ్ ఆఫర్ ధర. ఈ ధరలో 3జిబి ర్యామ్ తో 32జిబి స్టోరేజ్ ఉంటుంది. 4జిబి ర్యామ్ అండ్ 64జిబి స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది, దీని ధర రూ. 9,999. Moto E32s జూన్ 6 నుండి ఫ్లిప్‌కార్ట్ అండ్ రిటైల్ స్టోర్‌లలో మిస్టీ సిల్వర్ ఇంకా స్లేట్ గ్రే కలర్స్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
స్పెసిఫికేషన్‌లు
Moto E32s Android 12తో My UXని పొందుతుంది. అంతేకాకుండా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD + డిస్‌ప్లే ఇచ్చారు. MediaTek Helio G37 ప్రాసెసర్‌తో ఫోన్ 3 జిబి అండ్ 4జిబి ర్యామ్ పొందుతుంది. 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.
Moto E32s కెమెరా గురించి మాట్లాడితే మూడు వెనుక కెమెరాలు ఉన్నాయి. దీని ప్రాథమిక లెన్స్ 16 మెగాపిక్సెల్స్, రెండవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మాక్రో అండ్ మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సెల్ఫీల కోసం, Moto E32s 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం, Moto E32sలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ కి 5000mAh బ్యాటరీ ఇచ్చారు.