మరణించిన వ్యక్తులతో మాట్లాడించే మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజి.. ఎలా పనిచేస్తుందంటే ?

First Published Jan 30, 2021, 2:19 PM IST

ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో  వారికి  నచ్చిన వారు లేదా ఇష్టమైన వారిని కోల్పోయినందుకు బాధపడుతుంటారు, అది మనుషులు అయినా లేక జంతువులు అయినా. కానీ ప్రపంచాన్ని విడిచిపెట్టి, బంధాలను వొదులుకొంటు చనిపోయిన వారి నుండి ఎప్పటికీ మిగిలేది జ్ఞాపకాలు మాత్రమే. అయితే అలాంటి వాటిని అధిగమించేందుకు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక చాట్‌బాట్‌కు పేటెంట్ తీసుకొచ్చింది, ఇది ప్రపంచాన్ని విడిచిపెట్టిన వ్యక్తులు/ మృతి చెందిన వారు ఇక లేరు అనే కొరతను మిమ్మల్ని అనుభవించనివ్వదు.