వావ్.. అదృష్టం అంటే ఇదే: అమెజాన్ నుండి మౌత్ వాష్ ఆర్డర్ చేస్తే ఏం వచ్చిందో తెలుసా ?
కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఆన్ లైన్ ఆర్డర్లపైనే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్రతి చిన్న వస్తువు నుంచి గ్రోసరీస్, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రతిదీ డోర్ డెలివరీ సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం మీరు చూసే ఉంటారు.
కొంతకాలం క్రితం ఒక వ్యక్తి ఆపిల్ ఆర్డర్ చేస్తే అతనికి ఏకంగా ఐఫోన్ వచ్చింది. అయితే ఇలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మీరు ఆన్‌లైన్‌లో రూ.50-100 విలువైన వస్తువును ఆర్డర్ చేస్తే మీ ఇంటికి రూ .13,000 విలువైన వస్తువు డెలివరీ చేస్తే మీరు ఏంచేస్తారు... నిజంగా ఆశ్చర్యపోతారు కదా.. ముంబైకి చెందిన లోకేష్ డాగా అమెజాన్ నుండి మౌత్ వాష్ ఆర్డర్ చేశారు కాని అతనికి రెడ్ మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్ డెలివరీ అయ్యింది.
లోకేశ్ ఈ సమాచారాన్ని ట్వీట్ ద్వారా పోస్ట్ చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లోకేశ్ అమెజాన్ నుండి తనకు తప్పు ప్యాకేజీ వచ్చిందని దానిని తిరిగి నిజమైన వ్యక్తికి అందజేయమని కోరాడు. లోకేష్ ఆర్డర్ చేసిన కోల్‌గేట్ మౌత్ వాష్ అమెజాన్ ధర రూ .396, అయితే అతను పొందిన స్మార్ట్ ఫోన్ ధర రూ .12,499. మౌత్ వాష్ వంటి ఉత్పత్తులు రిటర్న్ చేయడానికి ఉండదని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి అతను అమెజాన్ కి ఇ-మెయిల్ చేసినట్టు తెలిపారు.
లోకేష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అతను చేసిన ట్వీట్ కి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఒకరు అదృష్టం అంటే నీదే అని, మరొకరు ఫోన్‌కు బదులుగా మౌత్ వాష్ పొందిన వ్యక్తి గురించి కూడా ఆలోచించండి అంటూ కామెంట్స్ చేశారు.
మరొకరైతే భాను సింగ్ అనే ట్విట్టర్ యూజర్ "సమస్య లేదు, ఆ ఫోన్ నాకు ఇవ్వండి లోకేష్ భాయ్ నాకు చాలా అవసరం. నేను మీకు రెండు మౌత్ వాష్ కొని పంపిస్తాను" అంటూ కామెంట్ చేస్తున్నారు.